కోహ్లీతో విభేదాలపై మాట్లాడిన గౌతమ్ గంభీర్
టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గౌతమ్ గంభీర్ తొలిసారి ప్రెస్‌కాన్ఫరెన్స్ నిర్వహించారు.
By Srikanth Gundamalla Published on 22 July 2024 1:30 PM ISTకోహ్లీతో విభేదాలపై మాట్లాడిన గౌతమ్ గంభీర్
టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గౌతమ్ గంభీర్ తొలిసారి ప్రెస్‌కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ క్రమంలోనే మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీతో విభేదాలపై స్పందించారు. కోహ్లీతో ఉన్న రిలేషన్ ఇద్దరు వ్యక్తల మధ్య ఉండేదే అని చెప్పారు. అది టీఆర్పీల కోసం కాదు అన్నారు. టీమిండియా శ్రీలంక టూర్‌కు వెళ్తున్న నేపథ్యంలో ముంబైలో చీఫ్ కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మీడియాతో మాట్లాడారు.
ఈ నేపథ్యంలో కోహ్లీ గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు గంభీర్ సమాధానాలు ఇచ్చారు. టెలివిజన్ రేటింగ్స్ గురించి ఏదైనా అనడం బాగానే ఉంటుందని, కానీ కోహ్లీతో తనకు ఎటువంటి విభేదం లేదని క్లారిటీగా చెప్పాడు గంభీర్. సొంత జట్టు, జెర్సీ కోసం పోరాడం హక్కు ప్రతి ప్లేయర్‌కు ఉంటుందన చెప్పాడు. విజయం సాధించి డ్రెస్సింగ్ రూమ్‌లో అడుగుపెట్టాలని ఆలోచన ఉంటుందన్నారు. కానీ 140 కోట్ల మంది భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని, దేశాన్ని గర్వంగా నిలిపేందుకు ప్రయత్నిస్తున్నామని గంభీర్ పేర్కొన్నాడు. అలాంటప్పుడు ఒకే రకంగా ఉంటామన్నారు చెప్పుకొచ్చారు.
ఈ క్రికెట్ ఫీల్డ్‌లో కోహ్లీతో మంచి రిలేషన్ ఉందని, అదే రిలేషన్ కొనసాగుతుందన్నాడు గంభీర్. కోహ్లీ ఓ ప్రొఫెషనల్ అని, వరల్డ్‌క్లాస్ అథ్లెట్ అని, ప్లేయర్‌గా అతన్ని అత్యంత గౌరవిస్తానని ప్రశంసించాడు. కలిసి జట్టు కోసం పనిచేయనున్నట్లు గంభీర్ పేర్కొన్నాడు. కోహ్లీతో చాలా సార్లు చాట్ చేశాననీ చెప్పాడు. బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామనీ.. ఒకే పేజీలో ఉండాలని గంభీర్ పేర్కొన్నాడు. గంభీర్- కోహ్లి చాలా సంవత్సరాలుగా భారతదేశం కోసం అనేక మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాల్లో పాలుపంచుకున్నారు. 2009లో, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంకపై తన తొలి వన్డే సెంచరీని సాధించిన విరాట్ కోహ్లీకి.. గంభీర్ తన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందించాడు.