టీమిండియా ఆటగాళ్లకు గుడ్‌న్యూస్‌.. త్వరలోనే మ్యాచ్‌ ఫీజు పెంపు

టీమిండియా ఆటగాళ్లకు త్వరలోనే బీసీసీఐ శుభవార్త చెప్పనుంది.

By Srikanth Gundamalla  Published on  27 Feb 2024 8:08 AM GMT
team india, cricket, bcci, match fee,

టీమిండియా ఆటగాళ్లకు గుడ్‌న్యూస్‌.. త్వరలోనే మ్యాచ్‌ ఫీజు పెంపు

టీమిండియా ఆటగాళ్లకు త్వరలోనే బీసీసీఐ శుభవార్త చెప్పనుంది. టెస్టు ఫార్మాట్‌ మ్యాచ్‌ ఫీజు పెంచేందుకు బీసీసీఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఒక సీజన్‌లో టెస్టు సిరీస్‌ మొత్తం ఆడిన ప్లేయర్లకు బోనస్‌ కూడా చెల్లించేందుకు సిద్ధవుతుంది ఇండియన్‌ క్రికెట్‌ బోర్డు. మ్యాచ్‌ ఫీజు పెంచడం ద్వారా ఆటగాళ్లు సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడేందకు ఆసక్తి కనబరుస్తారని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. చాలా వరకు క్రికెటర్లు ఈ టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో ఫీజు పెంచేందుకు బీసీసీఐ ఆలోచన చేస్తోంది.

అయితే.. జట్టులో రావడానికి ముందు రంజీల్లో ఆడటం తప్పనిసరి అని బీసీసీఐ చెబుతోంది. కానీ.. ఈ నిబంధనను ఇషాన్, శ్రేస్‌ వంటి ప్లేయర్లు పట్టించుకోవడం లేదు. మరోవైపు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో కుర్రాళ్లు అరంగేట్రం చేసి అదరగొట్టారు. ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్‌ఖాన్లు రాణించారు. దాంతో.. యువ ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు మ్యాచ్‌ ఫీజును పెంచడమే మార్గమని బీసీసీఐ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వరల్డ్‌లోనే ప్రపంచ ధనిక బోర్డుల్లో ఒకటి బీసీసీఐ. సెంట్రల్ కాంట్రాక్ట్‌ ద్వారా ఏ ప్లస్, ఏ, బీ, సీ అని నాలుగు కేటగిరిల కింద ఫీజులు చెల్లిస్తున్నారు. ఏ ప్లస్‌లో ఉన్న స్టార్ ఆటగాళ్లు ఏటా రూ.7 కోట్లు అందుకున్నారు. ఇక ఏ కేటగిరిలోని ఆటగాళ్లు రూ.5 కోట్లు, బీ కేటగిరిలోని వాళ్లు రూ.3 కోట్లు, సీ కేటగిరీల్లో వాళ్లు రూ.కోటి తీసుకుంటున్నారు.

ఆయా కేటగిరీల్లో ఉన్న ప్లేయర్లు:

A+ కేటగిరీలో విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మ, జస్ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజా

A హార్దిక్‌ పాండ్యా, అశ్విన్‌, షమీ, రిషబ్‌ పంత్, అక్షర్ పటేల్

B పుజారా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, సిరాజ్, సూర్యకుమార్, గిల్

C కేటగిరీలో కుల్దీప్, చాహల్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శ్రీకర్ భరత్, అర్ష్‌దీప్‌ సింగ్, ఇషాన్‌ కిషన్, సంజూ శాంసన్‌, శార్దూల్‌ ఠాకూర్, ధావన్, ఉమేశ్‌ యాదవ్

Next Story