పాండ్యాకు కెప్టెన్సీ నిరాకరణపై క్లారిటీ ఇచ్చిన అజిత్ అగార్కర్

టీమిండియా ప్రధాన కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ బాధ్యతలు తీసకున్నారు.

By Srikanth Gundamalla  Published on  22 July 2024 11:21 AM IST
team india, cricket, agarkar,  hardik captaincy,

పాండ్యాకు కెప్టెన్సీ నిరాకరణపై క్లారిటీ ఇచ్చిన అజిత్ అగార్కర్ 

టీమిండియా ప్రధాన కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ బాధ్యతలు తీసకున్నారు. ఈ నేపథ్యంలోనే తొలిసారిగా ఆయన ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు. గౌతమ్‌ గంభీర్‌తో పాటు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌ కూడా ఈ మీట్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అజిత్‌ అగార్కర్‌ టీ20 కెప్టెన్సీని పాండ్యాకు ఇవ్వకపోవడంపై స్పందించారు. గంభీర్ తన విజన్‌గురించి సవివవరంగా తెలిపాడు.

ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన జట్టును నడిపించేందుకు వచ్చానని గంభీర్ పేర్కొన్నాడు. టీ20 వరల్డ్‌ కప్ చాంపియన్, డబ్ల్యూటీసీ, వన్డే ప్రపంచ కప్‌లో రన్నరప్‌గా భారత్‌ నిలిచిందని పేర్కొన్నాడు. జట్టులో ఉన్న ప్రతి ఒక్కరితో తనకు మంచి సంబందాలుఉన్నట్లు చెప్పాడు. బీసీసీఐ కార్యదర్శిజైషా కూడా తనకు బాగా తెలుసన్నారు. సోషల్ మీడియాలో నిత్యం ఏదోక దానిపై వార్తలు వస్తూనే ఉంటాయని చెప్పారు. వాటన్నింటినీ పక్కనపెట్టి తమ బాధ్యలపై దృష్టి పెడతామని.. గంభీర్ ముఖ్యంకాదు టీమిండియానే ముఖ్యమని ఆయన చెప్పాడు. ఆటగాళ్లుకు స్వేఛ్చను ఇవ్వాలన్నాడు. ప్రతి ప్లేయర్‌ను ప్రోత్సహిస్తానన్నాడు. తన మద్దతు ఆటగాళ్లందరికీ ఎప్పుడూ ఉంటుందని గౌతమ్‌ గంభీర్ చెప్పాడు. సహాయక సిబ్బంది ఇంకా ఫైనలైజ్ కాలేదనీ.. రైయన్, అభిషేక్ నాయర్‌తో కలిసి పనిచేశానన్నాడు. ప్లేయర్ల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నట్లు గౌతమ్ గంభీర్ వెల్లడించాడు.

హార్దిక్‌ పాండ్యా అంశంపై అజిత్ అగార్కర్

హార్దిక్ పాండ్యా విషయంలో స్పందించిన చీఫ్‌ సెలెక్టర్ అజిత్ అగార్కర్.. అతను అత్యంత కీలక ప్లేయర్ అని చెప్పాడు. కెప్టెన్సీ నిర్ణయం తీసుకునేటప్పుడు అన్ని మ్యాచ్‌లు ఆడగలరా లేదా? అని ఆలోచించామని అన్నాడు. అతని నైపుణ్యాలను తక్కువ చేయడం లేదనీ.. ఫిట్‌నెస్ విసయంలో కాస్త సవాల్ ఎదురవుతోందని అగార్కర్ పేర్కొన్నాడు. టీ20 ప్రపంచ కప్ మరో రెండేళ్లలో జరగనుంది. అందుకే సూర్యకుమార్‌ వైపు ముగ్గుచూపామన్నాడు. తప్పకుండా అతను సక్సెస్ అవుతాడని భావిస్తున్నట్లు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పేర్కొన్నాడు.

Next Story