రనౌట్‌ కావడంతో నిరుత్సాహపడ్డ కానీ..: కెప్టెన్ రోహిత్‌శర్మ

భారత్‌ వేదికగా అప్ఘానిస్థాన్‌తో టీమిండియా మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడుతోంది.

By Srikanth Gundamalla  Published on  12 Jan 2024 5:51 AM GMT
team india, captain rohit sharma,  first t20, afghanistan,

రనౌట్‌ కావడంతో నిరుత్సాహ పడ్డ కానీ..: కెప్టెన్ రోహిత్‌శర్మ

భారత్‌ వేదికగా టీమిండియా అప్ఘానిస్థాన్‌తో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడుతోంది. అయితే.. గురువారం మొహాలీ వేదికగా తొలి టీ20 మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో భారత్‌ విజయం సాధించింది. అయితే.. మ్యాచ్‌ జరుగుతున్న సయమంలో చలి విపరీతంగా ఉంది. దాంతో.. ఆటగాళ్లు ఇబ్బందులు ఎదుర్కొనడం చూశాం. జేబుల్లో చేతులు పెట్టుకోవడం.. అంతేకాదు చేతులను రబ్‌ చేసుకుంటూ వేడిగా ఉండేలా చూసుకున్నారు. దాదాపు మ్యాచ్‌ సమయంలో 9 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే నమోదు అయ్యింది.

ఇక మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో భారత్‌ ఆధిక్యంలో కొనసాగుతోంది. మ్యాచ్‌ అనంతరం టీమిండియా కెప్టెన్‌ చలి కష్టాల గురించి మాట్లాడాడు. తాము అనుకున్నదాని కంటే చలి ఎక్కువగా ఉండిందని చెప్పారు. చేతికి బంతి తగిలితే విపరీతమైన నొప్పి కలిగిందన్నారు. అయితే.. తమ పరిస్థితి ఇప్పుడు బాగానే ఉందని చెప్పారు. తొలి టీ20 మ్యాచ్‌ను విజయంతో ముగించామని చెప్పారు. విపరీతమైన చలిలో బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదని అన్నాడు రోహిత్ వర్మ. భారత స్పిన్నర్లు అద్భుతంగా రాణించారని చెప్పారు. అయితే.. తాను రనౌట్‌ అయిన విషయంపై కూడా మాట్లాడిన రోహిత్.. ముందు ఆగ్రహానికి గురయ్యా అని చెప్పాడు. రనౌట్‌ కావడంతో నిరుత్సాహ పడ్డానని తెలిపాడు. ఇక తర్వాత శుభ్‌మన్ గిల్‌ ఎక్కువ సమయం బ్యాటింగ్ చేయాలని కోరుకున్నట్లు చెప్పాడు. అయితే.. గిల్‌ కాసేపు మంచి ఇన్నింగ్స్ ఆడినా.. త్వరగా పెవిలియన్‌కు చేరాడని అన్నారు రోహిత్. ఇక శివమ్ దూబె, జితేశ్, రింకూ, తిలక్‌ మంచి ఫామ్‌ను కొనసాగించారని కెప్టెన్ రోహిత్ శర్మ వారిని కొనియాడారు.

తొలి టీ20లో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు శివమ్‌ దూబె. హాఫ్‌ సెంచరీ (60*) పరుగులతో కీలక పాత్ర పోషించాడు. అయితే.. తాను మాట్లాడుతూ.. చలి ఎక్కువగా ఉన్నా.. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అసౌకర్యానికి గురికాలేదని తెలిపాడు. ఫీల్డింగ్ సమయంలో మాత్రం కాస్త ఇబ్బందులు పడినట్లు చెప్పాడు. అయితే.. చాలాకాలం తర్వాత నాలుగో స్థానంలో ఆడటంతో ముందు కాస్త ఒత్తిడి ఫీలయినట్లు చెప్పాడు. ఇక మూడు బంతులు ఆడిన తర్వాత దాని నుంచి బయటపడి రాణించినట్లు చెప్పాడు. ఇక బౌలింగ్‌ కూడా చేసిన శివమ్ దూబె ఒక వికెట్‌ తీశాడు.

Next Story