భారత మహిళా క్రికెట‌ర్‌కు చేదు అనుభవం

Taniya Bhatia claims she was robbed in London.భార‌త మ‌హిళా క్రికెట‌ర్ తానియా భాటియాకు ఇంగ్లాండ్‌ గ‌డ్డ‌పై చేదు అనుభ‌వం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Sep 2022 6:27 AM GMT
భారత మహిళా క్రికెట‌ర్‌కు చేదు అనుభవం

భార‌త మ‌హిళా క్రికెట‌ర్ తానియా భాటియాకు ఇంగ్లాండ్‌ గ‌డ్డ‌పై చేదు అనుభ‌వం ఎదురైంది. గుర్తు తెలియ‌ని ఆగంత‌కులు ఆమె గ‌దిలోకి ప్ర‌వేశించి ఆమె బ్యాగును ఎత్తుకెళ్లారు. బ్యాగులో విలువైన వాచీలు, డ‌బ్బులు, కార్డులు ఉన్నాయి. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా వికెట్ కీప‌ర్ తానియా వెల్ల‌డించింది. హోట‌ల్ మేనేజ్‌మెంట్‌తో పాటు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)పై మండిప‌డింది.

"లండ‌న్‌లోని మారియ‌ట్ హోట‌ల్ మేనేజ్‌మెంట్ తీరు న‌న్ను షాక్‌కు గురి చేసింది. నేను భారత క్రికెట్ జట్టుతో ఉండగా గుర్తు తెలియని వ్యక్తి నా రూమ్‌లోకి దూరి బ్యాగు దొంగిలించారు. అందులో డబ్బు లు, కార్డులు, వాచీలు, జ్యూవెలరీ ఉన్నాయి. ఈ హోట‌ల్ మ‌రీ అంత సుర‌క్షిత‌మా..? దీనిపై వెంటనే విచారణ చేసి నా బ్యాగును తిరిగి అందిస్తారని ఆశిస్తున్నా. ఇంగ్లాండ్‌ క్రికెట్ బోర్డు, తమ దేశంలో పర్యటించే క్రికెటర్లకు ఇలా భద్రత లేని హోటళ్లలో బస కల్పిస్తారని అనుకోలేదు. "అంటూ వరుస ట్వీట్లు చేసింది.

దీనిపై స‌ద‌రు హోట‌ల్ యాజ‌మాన్యం వెంట‌నే స్పందించింది. ఇలా జ‌రినందుకు క్ష‌మించాల‌ని కోరింది. ఏ పేరుతో రిజ‌ర్వేష‌న్ చేసుకున్నారో అందుకు సంబంధించిన వివ‌రాలు మెయిల్ చేయాల‌ని కోరింది. త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చింది.

మూడు వ‌న్డే మ్యాచ్‌ల సిరీస్ కోసం భార‌త జ‌ట్టు ఇంగ్లాండ్‌లో ప‌ర్య‌టించింది. ఈ ప‌ర్య‌ట‌న‌లో భార‌త జ‌ట్టు అద్భుత ప్ర‌ద్శర‌న చేసింది. ఇంగ్లాండ్‌ను వైట్ వాష్ చేసింది. ప్ర‌స్తుతం తానియా ట్వీట్ వైర‌ల్‌గా మారింది. ఇంగ్లాండ్‌ను వైట్ వాష్ చేయ‌డంతోనే కావాల‌నే ఈ పనిని చేశార‌ని నెటీజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

Next Story
Share it