ఆసుపత్రిలో అడ్మిట్ అయిన టాప్ క్రికెటర్

బంగ్లాదేశ్ క్రికెట్ లో ఓ వెలుగు వెలిగిన టాప్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ ఢాకా ప్రీమియర్ లీగ్ (DPL) 2025 మ్యాచ్ సందర్భంగా ఛాతీ నొప్పితో బాధపడ్డాడు.

By Medi Samrat
Published on : 24 March 2025 6:17 PM IST

ఆసుపత్రిలో అడ్మిట్ అయిన టాప్ క్రికెటర్

బంగ్లాదేశ్ క్రికెట్ లో ఓ వెలుగు వెలిగిన టాప్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ ఢాకా ప్రీమియర్ లీగ్ (DPL) 2025 మ్యాచ్ సందర్భంగా ఛాతీ నొప్పితో బాధపడ్డాడు. అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ పరిస్థితి విషమంగా ఉందని సంబంధిత వర్గాలు మీడియాకు తెలిపాయి. మార్చి 24 సోమవారం సావర్‌లోని బంగ్లాదేశ్ క్రిరా శిఖా ప్రొటిస్థాన్ నెం 3 గ్రౌండ్‌లో మొహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్, షైనెపుకుర్ క్రికెట్ క్లబ్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన జరిగింది.

మ్యాచ్ కు ముందు టాస్ కు తమీమ్ వెళ్ళాడు కూడా, కానీ షైనెపుకుర్ ఇన్నింగ్స్ సమయంలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అసౌకర్యంగా భావించాడు. ఆ తర్వాత, అతని చికిత్స కోసం వైద్య బృందం పరుగెత్తింది. అతనిని బయటకు తీసుకెళ్లడానికి హెలికాప్టర్ కూడా వచ్చింది. తమీమ్ హెలికాప్టర్ ఎక్కే స్థితిలో లేకపోవడంతో అతన్ని ఢాకాలోని షేక్ ఫజిలతున్నేసా ముజిబ్ మెమోరియల్ KPJ స్పెషలైజ్డ్ హాస్పిటల్ కు తరలించారు.

Next Story