రోడ్డు ప్ర‌మాదంలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారుడు దుర్మ‌ర‌ణం

Tamil Nadu table tennis player Vishwa Deenadayalan dies in road accident.రోడ్డు ప్ర‌మాదంలో తమిళనాడుకు చెందిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 April 2022 2:43 AM GMT
రోడ్డు ప్ర‌మాదంలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారుడు దుర్మ‌ర‌ణం

రోడ్డు ప్ర‌మాదంలో తమిళనాడుకు చెందిన 18 ఏళ్ల టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు విశ్వదీనదయాళన్ మృత్యువాత ప‌డ్డాడు. నేటి(సోమ‌వారం) నుంచి 83వ సీనియ‌ర్ నేష‌న‌ల్‌, ఇంట‌ర్ స్టేట్ టేబుల్ టెన్నిస్ చాంపియ‌న్ షిప్ ఛాంపియ‌న్ షిప్ ప్రారంభం కానుంది. ఇందులో పాల్గొనేందుకు విశ్వ మ‌రో ముగ్గురు ఆట‌గాళ్ల ఓ కారు టాక్సీలో గుహ‌వాటి నుంచి షిల్లాంకు ఆదివారం సాయంత్రం బ‌య‌లు దేరారు. మేఘాల‌య‌లోని షాన్ బంగ్లా స‌మీపంలోకి వీరు ప్ర‌యాణిస్తున్న కారును ఓ ట్ర‌క్కు ఢీ కొట్టింది.

ఈ ప్ర‌మాదంలో కారు డ్రైవ‌ర్ అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌గా.. విశ్వ‌తో పాటు అత‌డి స‌హ‌చ‌ర ఆట‌గాళ్లు రమేష్ సంతోష్ కుమార్, అబినాష్ ప్రసన్నాజీ శ్రీనివాసన్, కిషోర్ కుమార్ లు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని గాయ‌ప‌డిన వీరిని స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే.. అప్ప‌టికే విశ్వదీన‌ద‌యాళ‌న్ మృతి చెందిన‌ట్లు వైద్యులు తెలిపారు. మిగిలిన ముగ్గురికి చికిత్స కొనసాగుతోంది.

విశ్వదీన‌ద‌యాళ‌న్ మృతి ప‌ట్ల మేఘాల‌య సీఎం కాన్రాడ్ సంగ్మా దిగ్భాంత్రిని వ్య‌క్తం చేశారు. హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా ఆయన మృతికి సంతాపం తెలుపుతూ ఆయన కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు.

కాగా.. విశ్వ ఈ నెల 27 నుంచి ఆస్ట్రేలియాలో జరుగనున్న డబ్ల్యూటీటీ యూత్‌ టోర్నీలో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాల్సి ఉంది.

Next Story
Share it