మ‌హిళా అభిమానులు ఉన్నార‌ని ఐపీఎల్ ప్రసారాల‌పై నిషేదం

Taliban Ban IPL 2021 Broadcast In Afghanistan.అఫ్గానిస్థాన్‌ను తాలిబ‌న్లు హ‌స్త‌గ‌తం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. పైకి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Sep 2021 10:14 AM GMT
మ‌హిళా అభిమానులు ఉన్నార‌ని ఐపీఎల్ ప్రసారాల‌పై నిషేదం

అఫ్గానిస్థాన్‌ను తాలిబ‌న్లు హ‌స్త‌గ‌తం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. పైకి శాంతి వ‌చ‌నాలు జ‌పిస్తున్నా.. త‌మ పాల‌న ఎలా ఉంటుందో చేత‌ల‌తో చూపిస్తున్నారు. ప్ర‌జ‌ల హ‌క్కుల‌ను పూర్తిగా కాల‌రాస్తున్నారు. అక్క‌డి ప్ర‌జ‌లు త‌మ‌కు ఇష్ట‌మైన ఆట‌లు చూసేందుకు కూడా వీలులేకుండా చేస్తున్నారు. ఆ దేశంలో ఆట‌ల ప్ర‌సారాల‌పై నిషేదాలు విధిస్తున్నారు.

ఇండియ‌న్ ప్రీమియర్ లీగ్‌(ఐపీఎల్‌) కు ప్ర‌పంచ వ్యాప్తంగా య‌మా క్రేజ్ ఉంది. భార‌త్‌లోనే కాక‌.. ఐపీఎల్‌ను చాలా దేశాల్లో ప్ర‌జ‌లు వీక్షిస్తుంటారు. ఇటీవ‌ల యూఏఈ వేదిక‌గా ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్ మొద‌లైన సంగ‌తి తెలిసిందే. మ్యాచ్‌లు ఉహ‌కు అంద‌ని విధంగా జ‌రుగుతున్నాయి. అయితే.. ఐపీఎల్‌పై అఫ్గాన్‌లోని తాలిబ‌న్ల ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆ దేశంలో ఐపీఎల్‌ ప్రసారాలపై బ్యాన్ విధించింది. చీర్ గర్ల్స్ డ్యాన్స్ చేయడం మరియు మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానుల్లో మహిళలు ఉండటమే ఇందుకు ప్రధాన కారణమ‌ని పేర్కొంది. ఐపీఎల్ కు సంబంధించిన ఎటువంటి ప్రత్యక్ష ప్రసారం ఉండకూడదని ఆఫ్ఘన్ మీడియాకు ఆదేశాలు జారీ చేసారు.

'అఫ్గానిస్థాన్‌లో ఐపీఎల్ ప్రసారాలపై తాలిబాన్లు నిషేదం విధించారు. ఐపీఎల్ జరుగుతున్న స్టేడియాల్లో మహిళా ప్రేక్షకులు ఉండటం, వారిలో పలువురు డ్యాన్స్ చేస్తున్నారనే కారణంతో మ్యాచ్‌లను ప్రసారం చేయొద్దని అఫ్గాన్ మీడియా సంస్థలకు తాలిబాన్లు హెచ్చరికలు జారీ చేశారు' అని జర్నలిస్టు ఫవాద్ అమన్ ట్వీట్ చేశారు.

ఇక అఫ్గానిస్తాన్ లో ఉన్న తాలిబన్ల పాలనలో ముఖ్యంగా మహిళలు ఇబ్బందులు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే.

Next Story