T20 World Cup: టీమిండియా అక్కడిదాకా వెళ్లదు: ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్

టీ20 వరల్డ్ కప్‌ 2024 టోర్నీకి ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉంది.

By Srikanth Gundamalla  Published on  1 May 2024 11:30 AM GMT
t20 world cup, team india,   michael vaughan,

 T20 World Cup: టీమిండియా అక్కడిదాకా వెళ్లదు: ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్

టీ20 వరల్డ్ కప్‌ 2024 టోర్నీకి ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా దేశాలు తమ జట్టును ప్రకటించాయి. బీసీసీఐ కూడా వరల్డ్‌ కప్‌లో ఆడబోయే వారి లిస్ట్‌ను విడుదల చేసింది. గతేడాది వన్డే వరల్డ్‌ కప్‌లో టీమిండియా అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. ఫైనల్ మ్యాచ్‌ వరకు ఒక్క ఓటమి లేకుండా చేరుకుంది. కానీ చివరలో ఆస్ట్రేలియా రాణించడంతో కప్‌ను సొంతం చేసుకున్నారు. తాజాగా ఇప్పుడు జరగబోయే టీ20 వరల్డ్‌ కప్‌లో కూడా టీమిండియా అద్భుతంగా రాణిస్తుందని భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లే మంచి ప్లేయర్లు కూడా టీమ్‌లో ఉన్నారు.

అయితే.. టీమిండియా కప్‌ కొడుతుందని భారత క్రికెట్‌ అభిమానులు దీమా ఉంటే.. ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ మాత్రం భారత జట్టు గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. టీ20 వరల్డ్‌ కప్ 2024 టోర్నీలో భారత జట్టు ఫైనల్ చేరే అవకాశమే లేదని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాగన్ చెప్పాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. 'నా దృష్టిలో సెమీఫైనల్ చేరే జట్లు నాలుగు ఉన్నాయి. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌'. అంటూ మైఖేల్‌ వాగన్ ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టాడు. టీమిండియాతో పాటు 2022 టీ20 వరల్డ్‌ కప్‌లో ఫైనల్ చేరినా పాక్‌ను కూడా అతను పట్టించుకోలేదు. అయితే.. మైఖేల్‌ ట్వీట్‌పై ఇండియన్ క్రికెట్‌ అబిమానుల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కాదు.. ఆట ముందుంది.. టోర్నీ ప్రారంభం అయ్యాక మీరే చూస్తారంటూ కామెంట్స్ పెడుతున్నారు.

కాగా.. డిఫెండింగ్ చాంపియన్‌ హోదాలో జోస్ బట్లర్ కెప్టెన్సీలో టీ20 వరల్డ్‌ కప్‌ 2024 టోర్నీకి ఇంగ్లాండ్ సిద్దం అవుతోంది. మార్క్‌రమ్‌ కెప్టెన్సీలో ఈ టోర్నీకి సౌతాఫ్రికా రెడీ అవుతోంది. 2021 టీ20 వరల్డ్‌ టోర్నీని ఆస్ట్రేలియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. 2021 టీ20 వరల్డ్‌ కప్, 2022 టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీలో సౌతాఫ్రికా సెమీఫైనల్‌ వరకు కూడా రాలేదు. 2022 టీ20 వరల్డ్ కప్‌లో గ్రూప్ స్టేజ్‌లో నెదర్లాండ్స్‌ చేతిలో సౌతాఫ్రికా చిత్తుగా ఓడింది. మరోవైపు వెస్టిండీస్‌ కూడా 2021, 2022 టీ20 వరల్డ్‌ కప్పుల్లో సెమీఫైనల్స్ వరకు రాలేదు. గ్రూప్‌ స్టేజ్‌ నుంచే నిష్క్రమించింది.

Next Story