T20 World Cup: భారత జట్టు ప్రకటించిన బీసీసీఐ

తాజాగా బీసీసీఐ టీ20 వరల్డ్ కప్‌ కోసం భారత జట్టును ప్రకటించింది.

By Srikanth Gundamalla  Published on  30 April 2024 4:02 PM IST
t20 world cup, team india, bcci,

T20 World Cup: భారత జట్టు ప్రకటించిన బీసీసీఐ

ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‌ కొనసాగుతోంది. ఈ సీజన్‌ ముగిసిన వెంటనే టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీ ప్రారంభం కాబోతుంది. జూన్ 2వ తేదీ నుంచి వరల్డ్‌ కప్‌ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఆయా దేశాల జట్లు తమ స్క్వాడ్‌ను ప్రకటించేశాయి. ఇక టీమిండియాలో ఏఏ ప్లేయర్లు ఉండబోతున్నారనే ఆసక్తి కొనసాగింది. ఐపీఎల్‌లో చాలా మంది యంగ్ ప్లేయర్‌ దుమ్ముదులిపేస్తున్నారు. వారిలో నుంచి ఎవరెవరు టీమ్‌లో ఉంటారో అని క్రికెట్‌ అభిమానులు ఉత్కంఠగా చూశారు. తాజాగా బీసీసీఐ టీ20 వరల్డ్ కప్‌ కోసం భారత జట్టును ప్రకటించింది.

ఈ మెగా టోర్నీ కోసం అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. కాగా.. ఈ సారి టీ20 వరల్డ్‌ కప్‌కు యూఎస్‌ఏ, వెస్టిండీస్‌ రెండు దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. భారత్‌ తొలి మ్యాచ్‌ జూన్‌ 5న జరగనుంది. ఐర్లాండ్‌తో తలపడబోతుంది. మరోవైపు టీ20 వరల్డ్‌ కప్‌ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికాతో కెనడా ఢీకొట్టనుంది. మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌ గ్రూప్‌-ఏలో ఉన్న భారత్‌, పాకిస్థాన్‌ జట్లు న్యూయార్క్‌ వేదికగా జూన్ 9వ తేదీన తలపడతాయి. ఈసారి టీ20 వరల్డ్‌ కప్‌ సిరీస్‌లో మొత్తం 20 జట్లు ఆడుతున్నాయి. అమెరికాలో మూడు, వెస్టిండీస్‌లో 6 వేదికల్లో మొత్తం 55 మ్యాచ్‌లో ఈ సిరీస్‌లో ఉండబోతున్నాయి. ఇక ఫైనల్‌ మ్యాచ్‌ జూన్ 29వ తేదీన జరగనుంది.

టీ20 వరల్డ్‌ కప్‌ భారత జట్టు ఇదే:

రోహిత్‌ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చాహల్, అర్ష్‌దీప్‌సింగ్, బుమ్రా, సిరాజ్

ట్రావెలింగ్ రిజర్వ్‌: శుభ్‌మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్‌, అవేశ్‌ఖాన్‌


Next Story