క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల చేసింది. ఒమన్‌తో పాటు యూఏఈలో అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు ఈ టోర్నీ జరగనుంది. నవంబర్ 10,11 తేదీల్లో సెమీఫైనల్ మ్యాచ్‌లు జరగనుండగా.. నవంబర్ 14 న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే ఏర్పాటు చేశారు.
ఇక ఈ ప్రపంచకప్‌లో గ్రూప్-2లో ఉన్న భారత జట్టు.. తన తొలి మ్యాచ్ దాయాది పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 24న జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ 7.30గంటలకు ప్రారంభం కానుంది. భారత జట్టు తన తర్వాతి మ్యాచ్‌లను అక్టోబర్ 31న న్యూజిలాండ్‌తో, నవంబర్ 3న ఆఫ్ఘనిస్థాన్‌తో, నవంబర్ 5న గ్రూప్ బిలో టాప్ పొజిషన్‌లో నిలిచిన టీమ్, నవంబర్ 8న గ్రూప్ ఎలో రెండో స్థానంలో నిలిచిన టీమ్‌తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకే ప్రారంభమవుతాయి.