డబ్బే డబ్బు.. టీ20 వరల్డ్ కప్ ప్రైజ్‌మనీ.. ఎవరికెంతో తెలుసా?
దక్షిణాఫ్రికాపై ఉత్కంటభరితమైన మ్యాచ్‌లో ఏడు పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్నది.
By Srikanth Gundamalla Published on 30 Jun 2024 7:49 AM ISTడబ్బే డబ్బు.. టీ20 వరల్డ్ కప్ ప్రైజ్‌మనీ.. ఎవరికెంతో తెలుసా?
టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ విజేతగా భారత్ అవతరించింది. దక్షిణాఫ్రికాపై ఉత్కంటభరితమైన మ్యాచ్‌లో ఏడు పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్నది. అయితే.. ఈ టోర్నీలో విజేతలతో పాటు.. రన్నరప్‌కు ఇతర టీమ్‌లకు ప్రైజ్ మనీ అందిస్తారు. గెలిచిన టీమిండియాకు రూ.20.3 కోట్ల రూపాయలు అందుకుంటుంది. ఇకరన్నరప్‌గా నిలిచిన జట్టు సౌతాఫ్రికాకు రూ.10.64 కోట్లు అందుతాయి. మరోవైపు సెమీ ఫైనల్‌లో ఓడిన అప్ఘానిస్థాన్, ఇంగ్లండ్ జట్లకు రూ.6.5 కోట్లు దక్కుతాయి. సూపర్ 8 దశలతో సరిపెట్టుకున్న ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, వెస్టిండీస్, అమెరికా జట్లకు 3.18 కోట్ల రూపాయలు లభిస్తాయి.
ఇక గ్రూప్ లో మూడో స్థానంలో నిలిచిన జట్లకు రూ. 2.06 కోట్లు.. మిగిలిన జట్లకు రూ. 1.87 కోట్లు లభిస్తాయి. లక్షలు ప్రైజ్ మనీ దక్కుతుంది. 9-12వ స్థానంలో ఉన్న జట్లు రూ. 2 కోట్లు, 13-20వ స్థానంలో ఉన్న జట్లకు రూ. 1.87 కోట్లు లభిస్తాయి. గ్రూప్ దశలో విజయం సాధించిన జట్టుకు బోనస్‌గా రూ. 25.9 లక్షలు లభిస్తాయి. గత వరల్డ్ కప్ లో విజేతకు రూ. 12 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. అయితే ఈ సారి దాదాపు రెట్టింపు ప్రైజ్ మనీ లభించింది. టీ20 ప్రపంచ కప్ 2024 మొత్తం ప్రైజ్ పూల్ $11.25 మిలియన్లు అంటే భారత కరెన్సీలో 93.51 కోట్ల రూపాయలు. ఇప్పటివరకు జరిగిన టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఇది అత్యధికం కావడం గమనార్హం. అయితే.. ఈసారి ఫైనల్‌లో గెలిచి కప్ అందుకున్న భారత్ ఈ భారీ మొత్తం ప్రైజ్ మనీని దక్కించుకుంది.