T20 World Cup: టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్థాన్

టీ20 వరల్డ్‌ కప్‌లో ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోన్న అతిపెద్ద మ్యాచ్‌ జరగబోతుంది.

By Srikanth Gundamalla  Published on  9 Jun 2024 8:09 PM IST
t20 world cup, india vs Pakistan, cricket ,

T20 World Cup: టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ 

టీ20 వరల్డ్‌ కప్‌లో ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోన్న అతిపెద్ద మ్యాచ్‌ జరగబోతుంది. ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్ మ్యాచ్‌ కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్‌.. బౌలింగ్‌ను ఎంచుకుంది. దాంతో.. టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేయనుంది. ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఎదురుచూశారు. కాగా.. వర్షం కారణంగా 30 నిమిషాలు టాస్‌ ఆలస్యమైంది.

భారత్, పాకిస్థాన్‌ చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న టీమ్‌లు. ఇప్పుడు చాలా కాలం తర్వాత మరోసారి క్రికెట్‌ అభిమానులను అలరించేందుకు సిద్ధం అయ్యాయి. మరోవైపు ఈ మెగా టోర్నీలో పాకిస్థాన్‌కు మొదటి మ్యాచ్‌లో షాక్‌ ఎదురైంది. అమెరికా చేతిలో ఓటమిని చూసింది. ఇండియా మాత్రం మొదట గెలుపుని నమోదు చేసుకుని దాన్నే కంటిన్యూ చేయాలని భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది.

టీమిండియా : రోహిత్ శ‌ర్మ‌(కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్య‌కుమార్ యాద‌వ్, రిష‌భ్ పంత్(వికెట్ కీప‌ర్), శివం దూబే, హార్దిక్ పాండ్యా, ర‌వీంద్ర జ‌డేజా, అక్ష‌ర్ ప‌టేల్, జ‌స్ప్రీత్ బుమ్రా, సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.

పాకిస్థాన్ జ‌ట్టు : మ‌హ్మ‌ద్ రిజ్వాన్(వికెట్ కీప‌ర్), బాబ‌ర్ ఆజాం(కెప్టెన్), ఉస్మాన్‌ ఖాన్, ఫ‌ఖ‌ర్ జ‌మాన్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వాసిమ్, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ అమీర్

Next Story