టీ20 ప్రపంచ కప్ విజేత‌కు భారీ ప్రైజ్ మనీ.. రన్నరప్‌కు కూడా..

పంచ కప్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. మార్చి 8వ తేదీ ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

By -  Medi Samrat
Published on : 7 March 2026 2:10 PM IST

టీ20 ప్రపంచ కప్ విజేత‌కు భారీ ప్రైజ్ మనీ.. రన్నరప్‌కు కూడా..

2026 టీ20 ప్రపంచ కప్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. మార్చి 8వ తేదీ ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. నిర్ణయాత్మక మ్యాచ్‌లో గెలిచిన జట్టుపై లక్షలాది రూపాయల వరద కురుస్తుంది. ఇది మాత్రమే కాదు, ఓడిపోయిన జట్టు కూడా ధనిక‌మ‌వుతుంది. భారత జట్టు మూడోసారి టైటిల్ గెలుచుకునే అవకాశం ఉంది. కివీస్ తమ తొలి ట్రోఫీని ముద్దాడాల‌నుకుంటుంది.

2026 T20 ప్రపంచ కప్ కోసం ICC మొత్తం $13.5 మిలియన్లు (సుమారు ₹123.77 కోట్లు) బహుమతిని నిర్ణయించింది. ఇది 2024 T20 ప్రపంచ కప్ కంటే దాదాపు 20% ఎక్కువ. గత T20 ప్రపంచ కప్‌లో ICC $11.25 మిలియన్ల ప్రైజ్‌మనీని పంపిణీ చేసింది. మునుపటి టోర్నమెంట్ విజేత భారత జట్టు $2.45 మిలియన్లు అందుకోగా.. రన్నరప్ దక్షిణాఫ్రికా $1.28 మిలియన్లు అందుకుంది.

2026 T20 ప్రపంచ కప్ విజేత జట్టుకు ఇప్పుడు $3 మిలియన్లు (సుమారు రూ. 27.50 కోట్లు) ప్రైజ్ మనీ లభిస్తుంది. ఫైనల్‌లో ఓడిన జట్టుకు $1.6 మిలియన్లు (రూ. 14.67 కోట్లు) ప్రైజ్ మనీ లభిస్తుంది. సెమీ-ఫైనల్స్ లో ఓడిన జట్లకు $0.79 మిలియన్లు (సుమారు రూ. 7.24 కోట్లు) ఇవ్వబడతాయి.

అన్ని జట్లకు డబ్బు..

మొదటి సెమీఫైనల్లో న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో ఓడించింది.

రెండవ సెమీఫైనల్లో భారత్ ఇంగ్లాండ్‌ను 7 పరుగుల తేడాతో ఓడించింది.

టోర్నమెంట్‌లో పాల్గొనే జట్ల‌న్ని పైస‌లు పొందుతాయి

5వ నుండి 12వ స్థానాల్లో నిలిచిన జట్లకు $0.38 మిలియన్లు (సుమారు రూ. 3.48 కోట్లు) అందుతాయి.

13వ నుండి 20వ స్థానాల్లో నిలిచిన జట్లకు $0.25 మిలియన్లు (సుమారు రూ. 2.29 కోట్లు) అందుతాయి.

T20 ప్రపంచ కప్ 2026 ప్రైజ్ మనీ

విజేత: ₹27.50 కోట్లు

రన్నరప్: ₹14.67 కోట్లు

ఓడిన సెమీ-ఫైనలిస్టులు: ₹7.24 కోట్లు

5వ నుండి 12వ ర్యాంక్ పొందిన జట్లు: ₹3.48 కోట్లు

13వ నుండి 20వ ర్యాంక్ పొందిన జట్లు: ₹2.29 కోట్లు

Next Story