రోహిత్ శర్మకు, అభిమానులకు క్షమాపణలు చెప్పిన స్విగ్గీ..!

Swiggy Says Sorry To Rohit Sharma Fans.స్విగ్గీ దిగిరాక తప్పలేదు. రోహిత్ శర్మ అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పుకొచ్చింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 April 2021 3:42 PM IST
swiggy says sorry to Rohit Sharma

భారత్ లో క్రికెటర్లకు ఎంత ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా సదరు స్టార్ ఆటగాళ్లను ట్రోల్ చేయాలని అనుకుంటే.. అభిమానుల చేతుల్లో ట్రోలింగ్ కు గురికాక తప్పదు. తాజాగా ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ టీమిండియా వైస్ కెప్టెన్, ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మీద ఒక ఫన్నీ మీమ్ వేసింది. ఇది రోహిత్ శర్మ అభిమానులకు కోపాన్ని తెచ్చింది. దీంతో స్విగ్గీని బ్యాన్ చేయాలని ట్విట్టర్ లో ట్రెండ్ కూడా చేశారు. దీంతో స్విగ్గీ దిగిరాక తప్పలేదు. రోహిత్ శర్మ అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పుకొచ్చింది.

రోహిత్ శర్మ పై ఇటీవల స్విగ్గీ ఫన్నీ మీమ్ వేసింది. కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ కు ముందు స్విగ్గీ ఓ ఫోటో ట్వీట్ చేసింది. పావ్ బాజీ బండి వద్దకు రోహిత్ శర్మ డైవ్ చేసి మరీ పావ్ తీసుకుంటున్నట్లుగా రోహిత్ శర్మ ఫోటో ఉంది. స్విగ్గీ ఓ కామెంట్ చేస్తూ 'హేటర్స్ దీనిని ఫోటో షాప్ అంటారు' అని పోస్టు పెట్టింది. ఇక రోహిత్ శర్మ అభిమానులకు ఇది తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఆ ఫోటో డిలీట్ చేసి క్షమాపణలు చెప్పకుంటే తమ ఫోన్ లోని స్విగ్గీ యాప్ ని తొలగిస్తామంటూ హెచ్చరించారు. స్విగ్గీని బాయ్ కాట్ చేయాలంటే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ చేశారు.

దీంతో స్విగ్గీ క్షమాపణలు చెప్పింది. తాము ఎలాంటి దురుద్దేశంతో రోహిత్ మీమ్ ని రీపోస్టు చేయలేదని తెలిపింది. తాము దానిని క్రియేట్ చేయలేదని.. కేవలం రీట్వీట్ చేశామని క్లారిటీ ఇచ్చింది. తాము ఎవరి మనోభావాలను దెబ్బ తీయాలని భావించలేదని.. క్షమించాలంటూ పేర్కొంది.


Next Story