స్వప్నిల్ కుసలే చరిత్ర సృష్టించాడు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌లో భారత్‌కు కాంస్య పతకాన్ని అందించాడు. ఈ ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో భారత్‌కు ఇది మూడో పతకం. స్వప్నిల్ కంటే ముందు మను భాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్యం సాధించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్-మను జోడి కాంస్యం సాధించింది. స్వప్నిల్ మహిళల లేదా పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌లో ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారతీయుడు కావడం విశేషం.
స్వప్నిల్ పతకం సాధిస్తాడని ఎవరూ ఊహించలేదు. ఫైనల్ చేరి అందరినీ ఆశ్చర్యపరుస్తూ కాంస్య పతకాన్ని సాధించాడు. స్వప్నిల్ పతకం సాధించి భారత అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. స్వప్నిల్ స్కోరు 451.4 కాగా.. చైనాకు చెందిన యుకున్ లియు 463.6 స్కోరుతో బంగారు పతకాన్ని కైవసం చేసుకోగా.. ఉక్రెయిన్‌కు చెందిన సెర్హి 461.3 స్కోరుతో రజత పతకాన్ని గెలుచుకున్నాడు.