'వారి గురించే నా ఆందోళన'.. అభిషేక్ శర్మ ఫామ్‌పై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్

టీ20 ప్రపంచకప్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్‌పై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

By -  Medi Samrat
Published on : 22 Feb 2026 10:30 AM IST

వారి గురించే నా ఆందోళన.. అభిషేక్ శర్మ ఫామ్‌పై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్

టీ20 ప్రపంచకప్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్‌పై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టోర్నీలో ఇప్పటివరకు అభిషేక్ పరుగుల ఖాతా తెరవలేదు. దీనిపై ఆందోళన వ్యక్తమవుతూ ఉంది.

సూపర్-8లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరగనున్న మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన సూర్య.. "అభిషేక్ ఫామ్‌పై మాకు ఎలాంటి ఆందోళన లేదు. అతని ఫామ్‌ గురించి ఆందోళన పడే వారి గురించే నా ఆందోళన" అంటూ కౌంటర్ ఇచ్చాడు. "ఇది టీమ్ గేమ్. ఒక్కోసారి ఎంతటి బ్యాటర్‌కైనా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. గత ఏడాది మొత్తం తను అద్భుతంగా ఆడి మమ్మల్ని కవర్ చేశాడు. ఇప్పుడు మేము అతనికి అండగా ఉంటాం" అని కెప్టెన్‌గా తన మద్దతు ప్రకటించాడు.

భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ.. అభిషేక్ ఫామ్ గురించి జట్టులో ఎలాంటి చర్చా జరగలేదని, త్వరలోనే అతను పరుగులు చేయడం మొదలుపెడతాడని భరోసా ఇచ్చాడు.

Next Story