సూర్యకుమార్ యాదవ్‌కు జరిమానా విధించిన ఐసీసీ

పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన చర్యలకుగాను మ్యాచ్ ఫీజు జరిమానా విధించబడింది.

By -  Medi Samrat
Published on : 26 Sept 2025 7:28 PM IST

సూర్యకుమార్ యాదవ్‌కు జరిమానా విధించిన ఐసీసీ

పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన చర్యలకుగాను మ్యాచ్ ఫీజు జరిమానా విధించబడింది. సెప్టెంబరు 14న జరిగిన మ్యాచ్‌కు సంబంధించి సూర్యకుమార్‌పై పాక్‌ ఐసీసీకి ఫిర్యాదు చేయ‌గా.. జట్టు విజయం తర్వాత రాజకీయ ప్రకటన ఇచ్చాడు. దీంతో అతనికి జరిమానా విధించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన ప్రజెంటేషన్ వేడుకలో సూర్యకుమార్ పాకిస్థాన్ విజయాన్ని పహల్గామ్ బాధితులకు, సాయుధ బలగాలకు అంకితమిచ్చాడు. ఈ మేరకు వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది.

సూర్యకుమార్ యాదవ్‌ను దోషిగా తేల్చి టోర్నీలో జరగబోయే మ్యాచ్‌ల్లో ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయవద్దని హెచ్చరించింది. ఈ విషయాన్ని ఐసీసీ మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ విన్నవించారు.

భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) శుక్రవారం మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చేసిన ఫిర్యాదు మేరకు అతనిపై ఈ చర్య తీసుకున్నారు.

నిజానికి, భారత కెప్టెన్ పాకిస్తాన్‌తో జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో (సెప్టెంబర్ 14-ఆదివారం) భారత్ విజయాన్ని ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన భారత సాయుధ దళాలకు అంకితం చేశాడు. పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు ఆయన సంఘీభావం తెలిపారు. దీనిపై పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

సెప్టెంబర్ 14న భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ముగిసిన ఏడు రోజుల వ్యవధిలో పీసీబీ ఫిర్యాదు చేసింది. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి నిరాకరించాడు. భారత జట్టు విజయాన్ని ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన భారత సాయుధ దళాలకు అంకితం చేశాడు. పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు ఆయన సంఘీభావం తెలిపారు.

Next Story