ధోనీ తర్వాత బెస్ట్‌ కెప్టెన్ అతడే: సురేశ్ రైనా

సురేశ్‌ రైనా టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించాడు.

By Srikanth Gundamalla  Published on  28 Feb 2024 5:46 PM IST
suresh raina,  rohit sharma, team india ,

 ధోనీ తర్వాత బెస్ట్‌ కెప్టెన్ అతడే: సురేశ్ రైనా

ఎంఎస్‌ ధోనీ టీమిండియా కెప్టెన్‌గా ఎన్నో విజయాలను అందించాడు. అతడి ఆటతీరుకే కాదు.. కూల్‌ కెప్టెన్సీతో ఎంతో మంది అభిమానులను మూటగట్టుకున్నారు. ఎప్పటికీ కెప్టెన్‌ అంటే ధోనీలా ఉండాలని పోలుస్తుంటారు. ఏకంగా కొందరు ఆటగాళ్లు అయితే.. ధోనీనే ఫాలో అవుతారు. అయితే.. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా ధోనీ కెప్టెన్సీతో పోలుస్తూ టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించాడు. ధోనీ తర్వాత అత్యుత్తమ కెప్టెన్ అంటే రోహితే అన్ని చెప్పాడు.

ధోనీలాగానే రోహిత్‌ కూడా యువ ఆటగాళ్లకు చాలా అవకాశాలు కల్పిస్తున్నాడని కొనియాడాడు సురేశ్ రైనా. ఇంగ్లండ్‌తో జరుగుతున్న 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా మరో మ్యాచ్ ఉండగానే 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకోవడంపై సంతోషం వ్యక్తం చేశాడు. అయితే.. స్టార్‌ ప్లేయర్లు విరాట్‌, షమీ పూర్తిగా ఈ మ్యాచ్‌లకు దూరమైనా.. జడేజా, బుమ్రా, కేఎల్ రాహుల్, శ్రేయస్‌ వంటి ఆటగాళ్లు అన్ని మ్యాచుల్లో లేకపోయినా ఇంగ్లండ్‌ను చిత్తు చేశారు. యువ ఆటగాళ్లతో ఉన్న భారత క్రికెట్‌ జట్టు ఇంగ్లండ్‌ జట్టుపై పైచేయి సాధించారు. ఈ సిరీస్‌లో ఏకంగా నలుగురు యువ ఆటగాళ్లు అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. యువ ఆటగాళ్లకు అవకాశాలతో పాటు.. విజయాలను అందుకుంటున్న కెప్టెన్ రోహిత్‌పై ప్రశంసలు కురిపిస్తున్ నారు.

ఇక సురేశ్ రైనా మాట్లాడుతూ.. హిట్‌మ్యాన్‌ కెప్టెన్సీ బాగుందని చెప్పాడు. ధోనీ సారథ్యంలో తాను కూడా క్రికెట్‌ ఆడానని తెలిపాడు. సౌరవ్ గంగూలీ కూడా కుర్రాళ్లకు స్వేచ్ఛను ఇచ్చేవాడని గుర్తు చేశాడు. గంగూలీ తర్వాత ధోనీ జట్టును ముందుండి సమర్ధంగా నడిపించాడని రైనా అన్నాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ కూడా అలాగే టీమిండియాను సరైన మార్గంలో నడిపిస్తున్నాడని రైనా అభిప్రాయాన్ని తెలిపాడు. రోహిత్‌ శర్మ మంచి తెలివైన కెప్టెన్ అంటూ కొనియాడాడు. ఆటగాళ్లను రొటేట్ చేసే పద్ధతిని తాను ఎప్పుడూ చూడలేదన్నాడు. గతంలో ఇండియాలో ఒక ఫాస్ట్‌ బౌలర్‌, ముగ్గురు లేదా నలుగురు స్పిన్నర్లు ఉండేవారని చెప్పాడు. కానీ.. ప్రస్తుతం రోఇత్ ఇద్దరు పేసర్లను తీసుకుంటున్నాడని అన్నాడు. సిరాజ్, బుమ్రాలతో అద్భుతాలను చేయిస్తున్నాడని కొనియాడాడు. బుమ్రాకు గత మ్యాచ్‌లో రెస్ట్ ఇచ్చి ఆకాశ్‌ దీప్‌ను తీసుకొచ్చాడనీ.. తద్వారా బుమ్రాకు కూడా పనిభారం తగ్గించాడని చెప్పాడు. అలాగే యువ ప్లేయర్లు రాణించడంతో సిరీస్‌ను కూడా సొంతం చేసుకుంది సురేశ్ రైనా చెప్పాడు.

Next Story