రింకు సింగ్ చివ‌రి బంతి వ‌ర‌కూ క్రీజులో ఉన్నా సన్‌రైజర్స్ దే విజ‌యం..!

Sunrisers Hyderabad won by 23 runs. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్‌- 2023 19వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్

By Medi Samrat  Published on  15 April 2023 8:10 AM IST
రింకు సింగ్ చివ‌రి బంతి వ‌ర‌కూ క్రీజులో ఉన్నా సన్‌రైజర్స్ దే విజ‌యం..!

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్‌- 2023 19వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కేకేఆర్‌పై 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ ఈ సీజన్‌లో మొదటి సెంచరీని సాధించాడు. 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ జట్టు 23 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్సులో మయాంక్ అగర్వాల్ 9 పరుగుల‌కే పెవిలియన్‌కు చేరుకున్నాడు. రాహుల్ త్రిపాఠి కూడా 9 పరుగుల వద్ద ఔటయ్యాడు. కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ 26 బంతుల్లో 50 పరుగుల ఇన్నింగ్స్ చేశాడు. అభిషేక్ శర్మ 32 పరుగులు చేశాడు. కేకేఆర్ బౌల‌ర్ల‌లో ఆండ్రీ రస్సెల్ 3 వికెట్లు, వరుణ్ 1 వికెట్ తీసున్నారు.

229 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన‌ కేకేఆర్ జట్టులో ఓపెనర్ గుర్బాజ్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టగా.. ఆ తర్వాత నారాయణ్ జగదీషన్ 36 పరుగులు చేశాడు. 10 పరుగులకే వెంకటేష్ అయ్యర్ వికెట్ కోల్పోయింది. సునీల్ నరైన్ డ‌కౌట్ అయ్యాడు. కెప్టెన్ నితీష్ రాణా 41 బంతుల్లో 6 సిక్సర్లు, 5 ఫోర్లతో 75 పరుగులు చేశాడు. రింకు సింగ్ 31 బంతుల్లో అజేయంగా 58 పరుగులు చేశాడు. కానీ అతని ఇన్నింగ్స్ మ‌రోసారి జట్టును గెలిపించలేకపోయింది.


Next Story