రాజస్థాన్ రాయల్స్‌పై విజయంతో ఐపీఎల్ ఫైన‌ల్ చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్

క్వాలిఫయర్-1లో ఓటమి నుంచి కోలుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది.

By Medi Samrat  Published on  25 May 2024 6:44 AM IST
రాజస్థాన్ రాయల్స్‌పై విజయంతో ఐపీఎల్ ఫైన‌ల్ చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్

క్వాలిఫయర్-1లో ఓటమి నుంచి కోలుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. దీంతో ఆదివారం జరిగే టైటిల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో హైదరాబాద్ తలపడ‌నుంది, ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచి తొలి అడ్డంకిని దాటిన రాజస్థాన్ ఐపీఎల్‌ ప్రయాణం ఈ ఓటమితో ముగిసింది.

ఫాట్ క‌మ్మిన్స్‌ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు.. అద్భుతమైన బౌలింగ్‌ ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి IPL 2024 సీజన్‌లో ఫైనల్స్‌కు చేరుకుంది. ఆదివారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో హైదరాబాద్ తలపడనుంది. క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో హైదరాబాద్‌ను ఓడించిన KKR.. మరోసారి ఎస్ఆర్‌హెచ్‌తో తలపడనుంది.

టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు, అయితే హైదరాబాద్ బ్యాడ్ స్టార్ట్ నుండి కోలుకుంది. హెన్రిచ్ క్లాసెన్ 34 బంతుల్లో 50 పరుగుల అర్ధ సెంచరీ సహాయంతో 20 ఓవర్లలో 9 వికెట్లకు 175 పరుగులు చేసింది. బ‌దులుగా యశస్వి జైస్వాల్ రాజస్థాన్‌కు శుభారంభం అందించాడు, కానీ అతని అవుట్ తర్వాత జట్టు లయ చెదిరిపోయింది. ధృవ్ జురైల్ హాఫ్ సెంచరీ చేసి జట్టును ఆదుకునేందుకు ప్రయత్నించినప్పటికీ.. అవసరమైన రన్ రేట్ ఎక్కువగా ఉండటంతో అత‌ని ప్రయత్నాలు కూడా ఫలించలేదు. రాజస్థాన్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 139 పరుగులు మాత్ర‌మే చేసింది. హైదరాబాద్‌కు ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. షాబాజ్ మూడు వికెట్లు తీయడంతో రాజస్థాన్ ఇన్నింగ్స్ తడబడింది.

Next Story