ఒక్క రోజులో పెళ్లి చేసుకోలేరు క‌దా..! రాహుల్, అతియాల పెళ్లిపై సునీల్ శెట్టి కామెంట్స్‌

Sunil Shetty Talk about Athiya Shetty and KL Rahuls Wedding. బాలీవుడ్, క్రికెట్ మధ్య సంబంధం చాలా పాతది. చాలా మంది భారతీయ క్రికెటర్లు

By Medi Samrat  Published on  24 Aug 2022 1:21 PM IST
ఒక్క రోజులో పెళ్లి చేసుకోలేరు క‌దా..! రాహుల్, అతియాల పెళ్లిపై సునీల్ శెట్టి కామెంట్స్‌

బాలీవుడ్, క్రికెట్ మధ్య సంబంధం చాలా పాతది. చాలా మంది భారతీయ క్రికెటర్లు బాలీవుడ్ నటీమణులను పెళ్లి చేసుకున్నారు. ఈ జంటలను కూడా ఫ్యాన్స్‌ ఎక్కువగా ఇష్టపడతారు. దీనికి గొప్ప ఉదాహరణ నటి అనుష్క శర్మ,విరాట్ కోహ్లీ. వీరిద్దరి తరహాలోనే మరో జోడీ ఇప్పుడు చర్చనీయాంశమైంది. నటి అతియా శెట్టి క్రికెట‌ర్ కేఎల్‌ రాహుల్ జంట హాట్ టాఫిక్‌గా మారింది. గత కొన్ని నెలలుగా వీరిద్దరి పెళ్లికి సంబంధించిన వార్తలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా తన కూతురు పెళ్లిపై నటుడు సునీల్ శెట్టి స్పందించారు.

బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. అతియా తన సినిమాలకు తక్కువ, తన ప్రేమ-జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందనే వార్త‌లు ఉన్నాయి. భారత క్రికెటర్ కేఎల్ రాహుల్‌తో అతియా గత కొన్ని రోజులుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. కొన్ని నెలల క్రితం ఓ ఈవెంట్‌లో కలిసి కనిపించి మీడియా ముందు తమ సంబంధాన్ని ధృవీకరించారు. కత్రినా-విక్కీ, అలియా-రణ్‌బీర్‌ల పెళ్లి తర్వాత అతియా-రాహుల్‌ల పెళ్లిపై చర్చ జోరందుకుంది. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని చాలా వార్తలు వచ్చాయి.

కాగా, ఈ విషయంపై అతియా శెట్టి తండ్రి, నటుడు సునీల్ శెట్టి స్పందిస్తూ.. అసలు విషయాన్ని బయటపెట్టారు. ఈ వీడియోలో అతియా, కెఎల్ రాహుల్ వివాహం గురించి చాలా చర్చలు జరుగుతున్నాయని సునీల్‌ను అడిగారు. ప్లానింగ్ ఎలా జరుగుతోంది? అభిమానులకు ఈ శుభవార్త ఎప్పుడు అందుతుంది? అడ‌గ‌గా.. దీని గురించి సునీల్ శెట్టి మాట్లాడుతూ.. 'పిల్లల నిర్ణయం తీసుకున్న వెంటనే, ప్రిపరేషన్ వెంటనే ప్రారంభమవుతుంది. ఎందుకంటే రాహుల్ షెడ్యూల్ చాలా బిజీ. ప్రస్తుతం ఆసియా కప్, వరల్డ్ కప్, సౌతాఫ్రికా టూర్, ఆస్ట్రేలియా టూర్ వంటి అన్ని ముఖ్యమైన అంశాలకు సిద్ధమవుతున్నాడు. ఒక రోజు సెలవు తీసుకుంటే.. ఆ ఒక్క రోజులో వివాహం చేసుకోలేరు. కాబట్టి విరామం దొరికినప్పుడు పెళ్లి చేసుకుంటారని పేర్కొన్నారు.



Next Story