గవాస్కర్ టీ20 ప్రపంచకప్ జట్టు ఇదే.. ధావ‌న్‌, శ్రేయాస్‌కు ద‌క్క‌ని చోటు

Sunil Gavaskar picks his T20 World Cup squad.టీ20 ప్రపంచకప్‌ 2021కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతోంది. భార‌త్ అతిథ్యం ఇస్తున్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Sept 2021 2:15 PM IST
గవాస్కర్ టీ20 ప్రపంచకప్ జట్టు ఇదే.. ధావ‌న్‌, శ్రేయాస్‌కు ద‌క్క‌ని చోటు

టీ20 ప్రపంచకప్‌ 2021కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతోంది. భార‌త్ అతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీ క‌రోనా కార‌ణంగా యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే చాలా జ‌ట్లు మెగా టోర్నీలో పాల్గొనే జ‌ట్టును ప్ర‌క‌టించాయి. ఇక బీసీసీఐ(భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు) కూడా ఒక‌టి రెండు రోజుల్లో టీ 20 ప్ర‌పంచ‌క‌ప్ లో పాల్గొనే భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించ‌నుంది. అయితే.. అంత‌కంటే ముందు భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్ గవాస్కర్.. టీ20 ప్రపంచకప్ కోసం 15 మందితో కూడిన తన జట్టును ప్రకటించాడు.

సునీల్ గ‌వాస్క‌ర్ జ‌ట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌ శ్రేయాస్ అయ్యర్‌కి చోటు ద‌క్క‌లేదు. అనూహ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఓపెన‌ర్‌గా అవ‌కాశం ఇచ్చాడు. యువ ఆట‌గాడు సూర్య‌కుమార్ యాద‌వ్‌ను మూడో స్థానానికి ఎంపిక చేశాడు. హార్డ్ హిట్ట‌ర్ రిష‌బ్‌పంత్ తో పాటు పాండ్య బ్ర‌ద‌ర్స్‌కు కూడా చోటు ద‌క్కింది.

సునీల్ గవాస్కర్ టీ20 జట్టు

రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), సూర్యకుమార్ యాదవ్‌, రిషబ్ పంత్‌ (వికెట్‌ కీపర్), హార్దిక్‌ పాండ్యా, కేఎల్ రాహుల్‌, కృనాల్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌ (ఫిట్‌నెస్‌ సాధిస్తే), జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్‌ షమీ, భువనేశ్వర్‌ కుమార్‌, దీపక్‌ చహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, యుజ్వేంద్ర చహల్‌.

Next Story