ఆక‌ట్టుకుంటోన్న 'మౌకా మౌకా' యాడ్‌.. ఒక‌టి కొను మ‌రొక‌టి బ్రేక్ చేయ్‌

Star Sports bring back Mauka Mauka campaign.భార‌త్‌, పాకిస్థాన్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయంటే ఆ మ్యాచ్‌కు ఉన్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Oct 2021 5:49 AM GMT
ఆక‌ట్టుకుంటోన్న మౌకా మౌకా యాడ్‌.. ఒక‌టి కొను మ‌రొక‌టి బ్రేక్ చేయ్‌

భార‌త్‌, పాకిస్థాన్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయంటే ఆ మ్యాచ్‌కు ఉన్న క్రేజే వేరు. ఇరు దేశాల అభిమానులే కాక ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు ఈ మ్యాచ్ చూసేందుకు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా ఇరు జ‌ట్లు ఐసీసీ మెగా ఈవెంట్ల‌లో త‌ల‌ప‌డితే.. ఆ హీటే వేరు. ప్ర‌పంచ క‌ప్ గెల‌వ‌కున్నా ఏం కాదుకానీ.. ఈ మ్యాచ్ గెల‌వాల‌ని అభిమానులు కోరుకుంటారు అన్న సంగ‌తి తెలిసిందే. ఇక యూఏఈ వేదిక‌గా అక్టోబ‌ర్ 17 నుంచి పొట్టి ప్ర‌పంచ క‌ప్ ప్రారంభం కానుంది. భార‌త జ‌ట్టు త‌న తొలి మ్యాచ్‌ను దాయాది పాకిస్థాన్‌తో ఈ నెల 24న త‌ల‌ప‌డ‌నుంది. ఈ ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్‌లను స్టార్‌స్పోర్ట్స్ ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం చేస్తోంది.

స్టార్‌స్పోర్ట్స్ ప్ర‌సార భాగ‌స్వామిగా మారిన త‌రువాత 2015 ప్ర‌పంచ క‌ప్ నుంచి 'మౌకా మౌకా' యాడ్‌ను ప్ర‌త్యేకంగా తీర్చిదిద్దింది. ప్ర‌తి ఐసీసీ టోర్నీలో ఈ దాయాదులు త‌ల‌ప‌డిన‌ప్పుడ‌ల్లా వ‌స్తూ అభిమానుల‌ను ఎంతో అలరిస్తోంది ఈ యాడ్. కాగా.. ఈ సారి కాస్త ఫ‌న్నీగా, ప్ర‌త్య‌ర్థిని స‌ర‌దాగా ఏడిపించేలా రూపొందించారు. ఈ యాడ్ ప్రొయోలో ఏముందంటే..? ప్ర‌పంచ క‌ప్ సంద‌ర్భంగా ఓ పాక్ అభిమాని టీవీ కొందామ‌ని.. టీవీ షోరూమ్‌కి వ‌స్తాడు. ఈ సారి పాకిస్థాన్ గెలుస్తుంద‌ని త‌న వెంట ట‌పాసులు కూడా తీసుకుని వ‌స్తాడు. ఆ షాపు ఓన‌ర్ తో ఈ సారి పాక్ జ‌ట్టులో బాబ‌ర్ ఆజామ్ ఉన్నాడు, రిజ్వాన్ ఉన్నాడు ఖ‌చ్చితంగా దుబాయ్‌లో పాక్ గెలుస్తుంద‌ని చెబుతాడు.

వెంట‌నే స‌ద‌రు షాపు ఓన‌ర్ అత‌డికి రెండు టీవీల‌ను చూపిస్తాడు. ఒక‌టి కొన‌డానికి ఇంకొక‌టి బ్రేక్ చేయ‌డానికి అంటూ ఆట ప‌ట్టిస్తాడు. 2012లో పాకిస్తాన్ ఓడిపోయిన‌ప్పుడు కొంద‌రు పాక్ అభిమానులు టీవీలు ప‌గ‌ల‌కొట్టిన విష‌యాన్ని గుర్తు చూస్తూ ఆట‌ప‌ట్టిస్తాడు. ఈ యాడ్ భార‌త అభిమానుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. కాగా.. టీ 20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్‌, పాకిస్థాన్‌లు ఐదు సార్లు త‌ల‌ప‌డ‌గా.. అన్ని సార్లు టీమ్ఇండియానే విజేత‌గా నిలిచింది.

Next Story