దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు మాజీ ఆటగాళ్లను అరెస్టు చేశారు. లోన్వాబో త్సోత్సోబే, థమీ త్సోలేకిలే, ఎథీ మ్భలాటిని అవినీతి కార్యకలాపాల నిరోధక, పోరాట చట్టం, 2004లోని సెక్షన్ 15 కింద అవినీతి ఆరోపణలతో అరెస్టు చేశారు. 2015-16 రామ్‌స్లామ్ టీ20 ఛాలెంజ్ సమయంలో కుంభకోణం జరిగిందని, మ్యాచ్ ఫిక్సింగ్ విషయంలో ఆరోపణలు వచ్చాయి.
ఈ ముగ్గురూ మ్యాచ్‌ల ఫలితాలను మార్చేందుకు అంగీకరించారని ఆరోపణలను ఎదుర్కొన్నారు. డైరెక్టరేట్ ఫర్ ప్రయారిటీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ (DPCI) దీనిపై దర్యాప్తు చేసింది. దేశవాళీ T20 టోర్నమెంట్‌లో మూడు మ్యాచ్‌లను ఫిక్స్ చేయడానికి చేసిన ప్రయత్నాలకు సంబంధించి భారతీయ బుకీలతో ఈ క్రికెటర్లు కుమ్మక్కైన ఆరోపణలు ఉన్నాయి. అయితే కుట్రదారుల ప్రణాళికలు విఫలమయ్యాయని, ఏ మ్యాచ్‌లు కూడా ప్రభావితం కాలేదని క్రికెట్ దక్షిణాఫ్రికా (CSA) గతంలో తెలిపింది. 2016 - 2017 మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలకు సంబంధించి నిషేధించిన ఏడుగురు ఆటగాళ్లలో త్సోత్సోబే, త్సోలేకిలే, మ్భలతి ఉన్నారు.