విరాట్ చెబితే వినలేదు.. ఆ కారణం చేతనే తొలగించాం : గంగూలీ
Sourav Ganguly speaks on sacking Virat Kohli as ODI captain.టీమ్ఇండియా వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని
By తోట వంశీ కుమార్ Published on 10 Dec 2021 7:28 AM GMTటీమ్ఇండియా వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పించడానికి గల కారణాలను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించారు. టీ20 జట్టు కెప్టెన్‌గా విరాట్‌ను తప్పుకోవద్దని తాము కోరామని.. అయినప్పటికి విరాట్ తమ మాట వినలేదన్నాడు. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇద్దరు కెప్టెన్లు ఉండడం సరికాదని బీసీసీఐతో పాటు సెలక్షన్ కమిటీ బావించిందని.. ఈ నేపథ్యంలోనే సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పరిమిత ఓవర్లకు హిట్‌మ్యాన్ రోహిత్.. సుదీర్ఘ పార్మాట్‌కు విరాట్ కోహ్లీ కెప్టెన్లుగా ఉండాలని సెలక్టర్లు నిర్ణయించినట్లు చెప్పారు.
ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేమన్నాడు. అతడికి శుభాకాంక్షలు తెలియజేశాడు. రోహిత్ కెప్టెన్‌గా కూడా రాణించాలని కోరుకుంటున్నట్లు గంగూలీ వెల్లడించారు. ఇక వన్డేల్లో కోహ్లీకి 70 శాతానికిపైగా విజయాల రికార్డు ఉందని.. దాన్ని కూడా తాము పరిగణలోకి తీసుకున్నామన్నారు. అయితే.. హిట్‌మ్యాన్ రోహిత్ భారత్‌కు సారధ్యం వహించిన వన్డే మ్యాచ్‌ల్లో అతడి రికార్డు కూడా బాగుందని తెలిపారు. ఏదేమైనా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఇద్దరు కెప్టెన్లు ఉండకూడదన్నాడు. ఇక రోహిత్‌ను కెప్టెన్‌గా నియమించడాన్ని విరాట్ కూడా అంగీకరించాడన్నారు. ఇప్పటికే ఈ విషయమైన కోహ్లీతో మాట్లాడినట్లు వెల్లడించారు. ఇక పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా కోహ్లీ అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలియజేశాడు దాదా. ఇక విరాట్ సారధ్యంలో భారత జట్టు 95 వన్డే మ్యాచ్‌లు ఆడగా.. 65 మ్యాచ్‌ల్లో నెగ్గింది.