వివాహం రద్దు రూమర్స్‌పై స్మృతి మంధాన సంచలన పోస్టు

భారత మహిళా క్రికెట్ టీమ్ స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన-పలాశ్ ముచ్చల్ పెళ్లి రద్దు అయ్యింది.

By -  Knakam Karthik
Published on : 7 Dec 2025 2:50 PM IST

Sports News, Smriti Mandhana, Smriti Mandhana wedding, Palash Muchhal, Indian womens cricket

వివాహం రద్దు రూమర్స్‌పై స్మృతి మంధాన సంచలన పోస్టు

భారత మహిళా క్రికెట్ టీమ్ స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన-పలాశ్ ముచ్చల్ పెళ్లి రద్దు అయ్యింది. ఈ విషయాన్ని స్మృతి మందాన ఆదివారం స్వయంగా ధ్రువీకరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టు పెట్టారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలంటూ అభిమానులు, మీడియాకు ఆమె విజ్ఞప్తి చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ తో కొంతకాలంగా డేటింగ్ లో ఉన్న స్మృతి మంధాన ఇటీవల పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్దమైంది. ఈ నెల 23న వివాహానికి ముంబైలో ఏర్పాట్లు కూడా జరిగాయి. సంగీత్, మెహందీ వేడుకలు ఘనంగా జరగగా.. చివరి నిమిషంలో వివాహం ఆగిపోయింది.

స్మృతి తండ్రి శ్రీనివాస్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో పెళ్లిని వాయిదా వేస్తున్నట్లు ఆమె మేనేజర్ ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే, శ్రీనివాస్ మంధాన కోలుకుని ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్న తర్వాత కూడా వివాహానికి సంబంధించి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో స్మృతి, పలాశ్ ల వివాహం రద్దయినట్లేనని ప్రచారం జరిగింది. ఎంగేజ్‌మెంట్ ప్రపోజల్, హల్దీ, మోహందీ వేడుకలకు సంబంధించిన వీడియోలు స్మృతి తన సోషల్ మీడియా ఖాతాల్లోంచి తొలగించడంతో ఈ ప్రచారానికి ఊతమిచ్చింది. అయితే, ఈ వార్తలపై ఇటు స్మృతి కానీ అటు పలాశ్ కానీ స్పందించలేదు. పలాశ్ కుటుంబం మాత్రం వివాహం జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేసింది.

వాస్తవానికి, నవంబర్ 23న స్మృతి- పలాశ్ పెళ్లి జరగాల్సి ఉండేది. అయితే ఆ రోజు ఉదయం బ్రేక్​ ఫాస్ట్ చేస్తున్నప్పుడు స్మృతి తండ్రి శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఛాతినొప్పి రావడంతో ఆయనను కుటుంబ సభ్యులు హాస్పిటల్​లో చేర్పించారు. ఆ తరువాత పలాశ్ కూడా అస్వస్థతకు గురయ్యారు. దీంతో స్మృతి- పలాశ్ పెళ్లిని తాత్కాలికంగా వాయిదా వేశారు. చివరకి స్మృతి తండ్రి శ్రీనివాస్ డిశ్చార్జి అవ్వడంతో కాస్త హ్యాపీగా ఫీలైన ఆమె ఫ్యాన్స్, పలాశ్ మళ్లీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో ఆందోళన చెందారు. చివరకు అతని ఆరోగ్యం కుదుటపడింది.

Next Story