రాణించిన షమీ, సిరాజ్.. 188 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్

Siraj, Shami Lead As India Bowl Out Australia For 188. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

By Medi Samrat
Published on : 17 March 2023 4:46 PM IST

రాణించిన షమీ, సిరాజ్.. 188 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్

Siraj, Shami Lead As India Bowl Out Australia For 188


ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ తలా మూడు వికెట్లు తీయడంతో భారత్ 188 పరుగులకే ఆస్ట్రేలియాను ఆలౌట్ చేసింది. రవీంద్ర జడేజా కూడా రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. టాస్ గెలిచిన భార‌త్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఒక దశలో 2 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసి ప‌టిష్ట స్థితిలో ఉంది. అయితే మిచెల్ మార్ష్ అందించిన శుభారంభాన్ని కొన‌సాగించ‌డంలో ఇత‌ర బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. మిచెల్ మార్ష్ 65 బంతుల్లో 81 పరుగులు చేశాడు. అయితే అత‌డిని 20వ ఓవర్లో రవీంద్ర జడేజా పెవిలియ‌న్‌కు పంపాడు. ఈ మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా స్టాండ్-ఇన్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.


Next Story