నితీష్‌రెడ్డికి అందుకే అవకాశాలు ఇస్తున్నాం.. సిరీస్‌ ఓట‌మి త‌ర్వాత గిల్‌

న్యూజిలాండ్ మూడో ODIలో 41 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి 2-1తో సిరీస్ నెగ్గింది. త‌ద్వారా కివీస్ జట్టు భారత్‌లో తొలిసారి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది.

By -  Medi Samrat
Published on : 19 Jan 2026 9:10 AM IST

నితీష్‌రెడ్డికి అందుకే అవకాశాలు ఇస్తున్నాం.. సిరీస్‌ ఓట‌మి త‌ర్వాత గిల్‌

న్యూజిలాండ్ మూడో ODIలో 41 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి 2-1తో సిరీస్ నెగ్గింది. త‌ద్వారా కివీస్ జట్టు భారత్‌లో తొలిసారి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 337 పరుగులు చేసింది.

విరాట్ కోహ్లి సెంచరీ చేసినా టీమిండియా 296 పరుగులకే కుప్పకూలింది. కోహ్లీ 108 బంతుల్లో 124 పరుగులు చేయడం ద్వారా తన వన్డే కెరీర్‌లో 54వ సెంచరీని నమోదు చేశాడు. అలాగే.. బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా భారత జట్టులో చోటు దక్కించుకోవడం కోసం కష్టపడుతున్న హర్షిత్ రాణా తన వన్డే కెరీర్‌లో తొలి అర్ధ సెంచరీని నమోదు చేశాడు. రానా 43 బంతుల్లో 52 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సిరీస్ కోల్పోయిన తర్వాత భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దీనికి కారణాలను వివరించాడు. అంతేకాదు విరాట్ కోహ్లీ, రానాలపై కూడా ప్రశంసలు కురిపించాడు. దీంతో పాటు జ‌ట్టులో నితీష్ రెడ్డికి దక్కుతున్న అవకాశాల గురించి కూడా మాట్లాడాడు.

తొలి మ్యాచ్‌లో విజయం సాధించాక‌ సిరీస్‌ను 1-1తో సమం చేశారు.. వడోదరలో జరిగిన మ్యాచ్‌ తర్వాత మేం ఆడిన తీరుతో చాలా నిరాశకు గురయ్యానని శుభ్‌మన్ గిల్ తెలిపాడు. అభివృద్ధి చెందాల్సిన అనేక అంశాలు ఉన్నాయి. సానుకూల అంశాల గురించి మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ అద్భుతంగా ఉంది. ఈ సిరీస్‌లో హర్షిత్ రానా బ్యాటింగ్ చేసిన విధానం బాగుంది. 8వ స్థానంలో బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదన్నాడు. బాధ్యతను రానా నిర్వహించిన తీరు ప్రశంసనీయం. ఈ సిరీస్‌లో ఫాస్ట్‌ బౌలర్లు బాగా రాణించారని.. ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని నితీష్‌రెడ్డికి అవకాశాలు ఇవ్వాలని అనుకుంటున్నామ‌ని.. అత‌డికి తగినన్ని ఓవర్లు ఇవ్వాలనుకుంటున్నాం.. తద్వారా మనకు ఎలాంటి కాంబినేషన్లు పనికొస్తాయో.. ఎలాంటి బంతులు పని చేస్తాయో చూడగలం అని పేర్కొన్నాడు.

Next Story