ఆస్ట్రేలియా సిరీస్‌కు రోహిత్ స్థానంలో వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌

అక్టోబర్-నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేలు మరియు ఐదు టీ20లతో కూడిన ద్వైపాక్షిక సిరీస్ కోసం సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ భారత జట్లను ఎంపిక చేసింది.

By -  Knakam Karthik
Published on : 4 Oct 2025 3:20 PM IST

Sports News, ODI captain, BCCI,  Australia series, Shubman Gill

ఆస్ట్రేలియా సిరీస్‌కు రోహిత్ స్థానంలో వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌

అక్టోబర్-నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేలు మరియు ఐదు టీ20లతో కూడిన ద్వైపాక్షిక సిరీస్ కోసం సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ భారత జట్లను ఎంపిక చేసింది. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని వన్డే జట్టును ప్రకటించినట్టు అర్థమవుతోంది. రోహిత్ శర్మ స్థానంలో భారత వన్డే కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ ను నియమించారు. గిల్ ఇప్పటికే టెస్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

కాగా, ఇప్పటికే టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు వన్డే జట్టులో స్థానం కల్పించారు. వైస్ కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్ ను నియమించారు. ఆంధ్రా క్రికెట్ స్టార్ నితీశ్ కుమార్ రెడ్డి తొలిసారిగా భారత వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. అతడిని ఆల్ రౌండర్ కోటాలో తీసుకున్నట్టు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యాకు ఈ జట్టులో చోటు దక్కలేదు. ఈ మేరకు నేడు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలో సమావేశమైన టీమిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేసింది.

భారత వన్డే జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ (వీసీ), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (WK), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ జురేల్ సింగ్, జవీస్ జురేల్ సింగ్, ప్రసీద్ జురేల్ సింగ్,

భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (సి), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (విసి), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (డబ్ల్యుకె), వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్‌సన్ యాదవ్, సంజూకిన్ యాదవ్, సంజూకిన్ యాదవ్, వాషింగ్టన్ సుందర్.

Next Story