శ్రేయస్ అయ్యర్ 4 నెలలు దూరమని తేల్చేశారు.. పంత్-సూర్యలలో ఒకరికి ఛాన్స్..!

Shreyas Iyer to miss IPL 2021 confirms Delhi Capitals co-owner.తాజాగా అయ్యర్ సిరీస్ మొత్తానికి దూరం అయినట్లు బీసీసీఐ తెలిపింది.

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 25 March 2021 3:09 PM IST

Shreyas Iyer to miss IPL 2021 confirms Delhi Capitals co-owner

భారత క్రికెట్ జట్టును గాయాలు కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. మంగళవారం పూణె వేదికగా జరిగిన మొదటి వన్డేలో శ్రేయస్ ఎడమచేతికి గాయమైన సంగతి తెలిసిందే. ఎనిమిదో ఓవర్లో బెయిర్ స్టో కొట్టిన షాట్ ను ఆపే ప్రయత్నంలో అతడు డైవ్ చేశాడు. దీంతో ఎడమ మోచెయ్యి పై భాగంలో గాయమైంది. బాధతో విలవిలలాడుతూ శ్రేయస్ అయ్యర్ మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత ఫీల్డింగ్ చేయడానికి కూడా రాలేదు. గాయం కాస్త పెద్దదేనని చెబుతూ ఉండగా.. తాజాగా అయ్యర్ సిరీస్ మొత్తానికి దూరం అయినట్లు బీసీసీఐ తెలిపింది.

ఇంగ్లండ్ తో జరుగుతున్న సిరీస్ లో మిగతా వన్డేలకు శ్రేయస్ అయ్యర్ దూరం అయ్యాడు. వచ్చే నెల నుంచి ప్రారంభం కాబోతున్న ఐపీఎల్ టోర్నీలో కూడా శ్రేయస్ అయ్యర్ ఆడడం లేదు. అతడి గాయం తీవ్రమైనేదనని, చేతికి శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. శస్త్రచికిత్స చేస్తే దాదాపు 4 నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరముందని.. ఇంగ్లండ్ సిరీస్ తో పాటు ఐపీఎల్ మొత్తానికి శ్రేయస్ దూరమవుతాడని బీసీసీఐ తెలిపింది. మళ్లీ నెట్స్ లోకి రావాలంటే అతడికి 4 నెలల సమయం పడుతుంది.

అతడి గాయం చాలా తీవ్రంగానే ఉందని తెలిపింది. అయ్యర్ జట్టుకు దూరం అవ్వడంతో అతడి స్థానంలో రిషబ్ పంత్ లేదా సూర్యకుమార్ యాదవ్ తుది జట్టులో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఐపీఎల్ లో ఢిల్లీకి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ ఎడిషన్ లోనూ అతడినే కెప్టెన్ గా కొనసాగిస్తామని ఢిల్లీ డేర్ డెవిల్స్ ప్రాంఛైజీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అతడు టోర్నీకి దూరం అయ్యాడు. కెప్టెన్ గా ఎవరిని ఉంచుతారనే విషయమై ఓ క్లారిటీ త్వరలోనే రానుంది.


Next Story