ఆట పట్టించిన శ్రేయస్‌.. వెళ్లిపోయిన సిరాజ్‌

Shreyas Iyer performs magic tricks again.టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమ్ఇండియా ప్ర‌స్తుతం టెస్టు సిరీస్ కోసం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Nov 2021 4:24 AM GMT
ఆట పట్టించిన శ్రేయస్‌.. వెళ్లిపోయిన సిరాజ్‌

టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమ్ఇండియా ప్ర‌స్తుతం టెస్టు సిరీస్ కోసం స‌న్నద్దం అవుతోంది. న‌వంబ‌ర్ 25 నుంచి న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. కాగా.. ఈ నేప‌థ్యంలో ప్రాక్టీస్ సెష‌న్ అనంత‌రం టీమ్‌లోని యువ‌గాళ్లు ఒక్క‌చోట చేరి స‌ర‌దాగా గ‌డుపుతున్న వీడియోను భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో టీమ్ఇండియా మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ పేస్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్‌ను ఆట‌ప‌ట్టించాడు. దీంతో అలిగిన సిరాజ్ అక్క‌డి నుంచి వెళ్లిపోయాడు.

శ్రేయాస్ అయ్య‌ర్ పేక ముక్క‌ల‌తో ట్రిక్స్ చేస్తాడ‌ని తెలిసిందే. అందుకు సంబంధించిన ప‌లు వీడియోల‌ను త‌న సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికే అయ్య‌ర్ షేర్ చేశాడు. తాజాగా.. సిరాజ్‌పై త‌న ట్రిక్ ప్ర‌యోగించాడు. త‌న చేతిలో నాలుగు కార్డు ముక్కల్లో ఒక‌దాన్ని తీయాల‌ని సిరాజ్‌ను శ్రేయాస్ కోరాడు. సిరాజ్‌..4 నెంబ‌ర్ కార్డును తీసి శ్రేయాస్ కు అందించాడు. అనంత‌రం శ్రేయాస్ రాండ‌మ్‌గా ఓ కార్డును తీసి సిరాజ్ చేతిలో పెట్టాడు. త‌రువాత కాసేప‌టికి చేతిని తెర‌వాల్సిందిగా సూచించాడు. అతడు చెప్పినట్లుగానే సిరాజ్‌ చేతిలో జోకర్‌ దర్శనమిచ్చింది. దీంతో అవాక్కవడం సిరాజ్‌ వంతైంది. వెంటనే కార్డును కిందపడేసి నవ్వుతూ అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయాడు సిరాజ్‌. ఇక శ్రేయస్‌ మాత్రం మరింత జోష్‌గా.. మియాన్‌ కుచ్‌ తో బోలో మియాన్‌.. కుచ్‌ తో బోలో(మాట్లాడండి సర్‌.. ఏదైనా మాట్లాడండి) అంటూ సరదాగా ఆటపట్టించాడు.

Next Story
Share it