దుబాయ్‌లో జరుగుతున్న ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ పోరుకు అనూహ్య పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా భారత్-పాక్ క్రికెట్ పోరుకు భారీ డిమాండ్ ఉండగా, ఈ సారి మాత్రం ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో, మ్యాచ్ నిర్వాహకులు టికెట్లు అమ్మకానికి కొత్త ఆఫర్ ప్రకటించాల్సి వచ్చింది.
“Buy 2, Get 1 Free” స్కీమ్‌తో కూడా టికెట్లు ఎక్కువగా కదలకపోవడం నిర్వాహకులను ఇబ్బందికి గురిచేస్తోంది. భారత్-పాక్ మ్యాచ్‌లకు సాధారణంగా రికార్డు స్థాయిలో డిమాండ్ ఉండే పరిస్థితిలో, ఈసారి ప్రేక్షకుల స్పందన తగ్గిపోవడం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ARY రిపోర్ట్స్ ప్రకారం... టికెట్ల ధరలు అత్యంత ఎక్కువగా ఉండటం, సోషల్ మీడియాలో వస్తున్న బహిష్కరణ పిలుపులు, దుబాయ్‌లోని తీవ్ర ఉష్ణోగ్రతలు.. ప్రేక్షకులను నిరుత్సాహపరుస్తున్నాయి.