విడాకుల వార్త‌ల‌పై క్లారిటీ ఇచ్చిన షోయ‌బ్‌..! సానియా ఫోటోను పోస్ట్ చేస్తూ

Shoaib Malik's Post For Sania Mirza Amid Divorce Rumours.నేడు(న‌వంబ‌ర్ 15) సానియా మీర్జా పుట్టిన రోజు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Nov 2022 11:47 AM IST
విడాకుల వార్త‌ల‌పై క్లారిటీ ఇచ్చిన షోయ‌బ్‌..! సానియా ఫోటోను పోస్ట్ చేస్తూ

భార‌త టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాక్ క్రికెట‌ర్ షోయ‌బ్ మాలిక్‌లు విడాకులు తీసుకోనున్నారు అనే వార్త గ‌త కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో ప్ర‌చారంలో ఉంది. అయితే.. దీనిపై అటు సానియా గానీ, ఇటు షోయ‌బ్ మాలిక్ గానీ స్పందించ‌క‌పోవ‌డంతో ఇది నిజ‌మేన‌ని చాలా మంది అనుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆ వార్త‌ల‌ను పుల్‌స్టాప్ పెట్టే ప్ర‌య‌త్నం చేశాడు షోయబ్‌.

నేడు(న‌వంబ‌ర్ 15) సానియా మీర్జా పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా షోయ‌బ్ త‌న భార్య సానియాకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశాడు. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు నువ్వు చాలా ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. ఈ రోజును పూర్తిగా ఆస్వాదించు. అని ట్వీట్ చేశాడు షోయ‌బ్‌. అంతేకాకుండా వారిద్ద‌రు జంట‌గా ఉన్న ఫోటోను పోస్ట్ చేశాడు.

సానియా మీర్జా, షోయబ్ మాలిక్ లు ఏప్రిల్ 2010లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2018లో కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్‌ జన్మించాడు.

ఇదిలా ఉంటే.. వీరిద్ద‌రు క‌లిసి ఓ టాక్ షో చేయ‌నున్నార‌ని వార్త‌లు వచ్చాయి. పాకిస్తాన్‌కు చెందిన ఉర్దూ ఓటీటీ వేదిక ఉర్దూపిక్స్ కోసం ఈ జోడి క‌లిసి "ది మీర్జా మాలిక్ షో" పేరుతో టాక్ షో చేస్తోంది. త్వ‌ర‌లోనే ఈ కార్య‌క్ర‌మం ప్ర‌సారం కానున్న‌ట్లు స‌ద‌రు చాన‌ల్ తెలిపింది. షోయ‌బ్ భుజం మీద సానియా చేయి వేసి దిగిన ఫోటోను పోస్ట్ చేసింది. దీంతో నెటింట వీరిపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌చారం కోస‌మే సానియా, షోయ‌బ్‌లు విడాకుల డ్రామా ఆడుతున్నార‌ని కొంద‌రు కామెంట్లు పెడుతుండ‌గా.. మ‌రికొంద‌రు మాత్రం ఈ షో షూటింగ్ గ‌తంలోనే జ‌రిగి ఉంటుంద‌ని, షోకు ఇబ్బందులు రాకుండా ఉండేదుకే విడాకుల ప్ర‌క‌ట‌న వాయిదా వేసి ఉండొచ్చున‌ని అంటున్నారు.

Next Story