'పిచ్‌పై షాట్లే కాదు.. స్నేహాలు కూడా..' RO-KO రిటైర్మెంట్‌పై ధావన్ భావోద్వేగ పోస్ట్‌

భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల రిటైర్మెంట్‌పై ప్రత్యేక పోస్ట్‌ను పంచుకున్నారు.

By Medi Samrat
Published on : 14 May 2025 2:50 PM IST

పిచ్‌పై షాట్లే కాదు.. స్నేహాలు కూడా.. RO-KO రిటైర్మెంట్‌పై ధావన్ భావోద్వేగ పోస్ట్‌

భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల రిటైర్మెంట్‌పై ప్రత్యేక పోస్ట్‌ను పంచుకున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్‌ను పంచుకుంటూ.. ధావన్ భావోద్వేగ సందేశాన్ని రాశాడు.

ధావన్ మూడు విషయాలలో ఇద్దరు లెజెండ్‌లకు ధన్యవాదాలు తెలిపాడు.. పిచ్‌పై షాట్‌లు ఆడ‌డమే కాదు.. స్నేహం కూడా ఏర్పడుతుందని చెప్పాడు. ఈ ఇద్దరు లెజెండ్‌లతో చరిత్ర సృష్టించిన‌ ప్రత్యేక క్షణాలను పంచుకోగలిగినందుకు గర్విస్తున్నానని ఆయన అభిప్రాయపడ్డారు.

'గబ్బర్'గా ప్రసిద్ది చెందిన శిఖర్ ధావన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్‌ను పంచుకున్నాడు.. అందులో పిచ్‌పై షాట్లు ఆడ‌డమే కాదు.. స్నేహాలు కూడా ఏర్పడతాయని రాశాడు. ఈ ఇద్దరు మహానుభావులతో ఈ రంగాన్ని పంచుకున్నందుకు గర్వపడుతున్నాను. జ్ఞాపకాలు, నవ్వులు, చరిత్ర సృష్టించిన క్షణాలకు ధన్యవాదాలు. టెస్ట్ క్రికెట్ మిమ్మల్ని మిస్ అవుతుందన్నారు.

7 మే 2025న రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2013లో వెస్టిండీస్‌పై అరంగేట్రం చేసిన హిట్‌మ్యాన్ 67 టెస్టు మ్యాచ్‌లు ఆడి 4,301 పరుగులు చేశాడు. అతని సగటు 40. 12 సెంచరీలు, 18 అర్ధసెంచరీలు చేశాడు. అతని అత్యధిక స్కోరు 212. WTC చరిత్రలో 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి రోహిత్ 41 సగటుతో 2,716 పరుగులు చేశాడు. WTC చరిత్రలో రోహిత్‌ భారత్‌ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు.

రోహిత్ రిటైర్ అయిన 5 రోజుల తర్వాత విరాట్ కోహ్లి తన టెస్ట్ రిటైర్మెంట్ 12 మే 2025న ప్రకటించాడు. అతను 2011లో వెస్టిండీస్‌తో భారత్‌ తరపున తన మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. కోహ్లి టెస్ట్ క్రికెట్‌లో 123 మ్యాచ్‌లు ఆడి 9,230 పరుగులు చేశాడు. కోహ్లీ అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్ల‌లో ఒక‌డు. 68 మ్యాచ్‌లలో 40 మ్యాచ్‌లలో జట్టును విజయపథంలో నడిపించాడు.

Next Story