పుణె వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో శిఖర్ ధావన్ రెండు పరుగుల తేడాతో తృటిలో శతకాన్ని కోల్పోయాడు. 106 బంతుల్లో 11 పోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 98 పరుగులు చేశాడు. శతకానికి రెండు పరుగుల దూరంలో స్టోక్స్ బౌలింగ్‌లో మోర్గాన్ పట్టిన క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం టీమ్ఇండియా 40 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. హార్ధిక్ పాండ్యా 1, కేఎల్ రాహుల్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఎట్టకేలకు ఫామ్ అందుకున్న గబ్బర్..
గత కొంత కాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న గబ్బర్ జట్టులో తన స్థానాన్ని ప్రశ్నార్థకం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టెస్టు, టీ20ల్లో చోటు కోల్పోయాడు శిఖర్. ఇషాన్ కిషన్, మయాంక్ అగర్వాల్, రిషబ్ పంత్, సంజు శాంసన్ వంటి యువ క్రికెటర్లు సత్తాచాటుతుండడంతో గబ్బర్ భవితవ్యం ప్రశ్నార్థకరంగా మారింది. దీంతో ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో కనుక రాణించకుంటే.. వన్డే జట్టులో కూడా చోటు కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో శిఖర్ సత్తా చాటాడు. శతకం చేజార్చుకున్నప్పటికి జట్టులో తన స్థానాన్ని నిలుపుకున్నాడు.