ప్రాంక్‌ చేయబోతే.. శిఖర్ ధావన్ చెంప‌ చెల్లుమనిపించిన తండ్రి.. వీడియో వైర‌ల్‌

Shikhar Dhawan Father Slaps Him In Viral Video.త‌న ప‌ని అయిపోయింద‌నుకున్న ప్ర‌తీసారి బ్యాట్‌తోనే స‌మాధానం చెబుతూ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Jan 2022 4:32 AM GMT
ప్రాంక్‌ చేయబోతే.. శిఖర్ ధావన్ చెంప‌ చెల్లుమనిపించిన తండ్రి.. వీడియో వైర‌ల్‌

త‌న ప‌ని అయిపోయింద‌నుకున్న ప్ర‌తీసారి బ్యాట్‌తోనే స‌మాధానం చెబుతూ విమ‌ర్శ‌కుల‌ నోరు మూయిస్తున్నాడు టీమ్ఇండియా ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్‌. ద‌క్షిణాఫ్రికాతో మూడు వ‌న్డేల సిరీస్‌లో రెండు అర్థ‌శ‌త‌కాల సాయంతో 169 ప‌రుగులు చేశాడు. తాజాగా శిఖ‌ర్ ధావ‌న్ త‌న తండ్రి చేతిలో దెబ్బ‌లు తిన్నాడు. అయితే.. అది నిజంగా కాదులెండి. ఈ సీనియ‌ర్ ఆట‌గాడు సోష‌ల్ మీడియాలో య‌మా యాక్టివ్‌గా ఉంటాడు అన్న సంగ‌తి తెలిసిందే. రీల్స్ చేయ‌డం అంటే శిఖ‌ర్‌కు మ‌హా ఇష్టం. అందులో బాగంగా త‌న తండ్రితో క‌లిసి శిఖ‌ర్ చేసిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఆ వీడియోలో ఏముందంటే.. రూమ్‌లోంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన గ‌బ్బ‌ర్‌ తండ్రి.. ధావ‌న్‌ను ఏదో అడుగ‌గా.. ఓ మాస్ డైలాగ్‌ను శిఖ‌ర్ ధావ‌న్ చెబుతాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన తండ్రి.. శిఖ‌ర్‌ను చెంప దెబ్బ కొట్టాడు. అంతే కాదు అత‌డిని రూమ్‌లోకి నెట్టేస్తాడు. ఈ వీడియోకు శిఖ‌ర్ ధావ‌న్ ​ 'Baap hamesha Baap hi Hota hai' అనే క్యాప్షన్ జోడించి సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా.. నిమిషాల వ్య‌వ‌ధిలో ల‌క్ష‌ల సంఖ్య‌లో వ్యూస్ వ‌చ్చాయి. ఇప్ప‌టికే 8ల‌క్ష‌ల కు పైగా లైకులు వ‌చ్చాయి. ఈ వీడియోను చూసిన హర్భజన్‌ సింగ్, రుతురాజ్‌ గైక్వాడ్ లు గబ్బర్‌ యాక్టింగ్‌ను ఆకాశానికెత్తారు. ఇంకెందుకు ఆల‌స్యం మీరు ఓ సారి ఆ వీడియోపై లుక్కేయండి.

Next Story
Share it