పాకిస్థాన్ క్రికెట్ సెలక్షన్ కమిటీ తాత్కాలిక ఛైర్మన్‌గా షాహిద్ అఫ్రిదీ

Shahid Afridi named interim chief selector of Pakistan men's team. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీని పురుషుల జాతీయ సెలక్షన్ కమిటీ తాత్కాలిక ఛైర్మన్‌గా

By M.S.R  Published on  24 Dec 2022 1:17 PM
పాకిస్థాన్ క్రికెట్ సెలక్షన్ కమిటీ తాత్కాలిక ఛైర్మన్‌గా షాహిద్ అఫ్రిదీ

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీని పురుషుల జాతీయ సెలక్షన్ కమిటీ తాత్కాలిక ఛైర్మన్‌గా నియమించినట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు శనివారం (డిసెంబర్ 24) ప్రకటించింది. అబ్దుల్ రజాక్, రావు ఇఫ్తికార్ అంజుమ్ ప్యానెల్‌లో ఇతర సభ్యులుగా ఉన్నారు. హరూన్ రషీద్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. మహ్మద్ వసీం నేతృత్వంలోని ప్యానెల్ నుండి అఫ్రిది నేతృత్వంలోని ముగ్గురు వ్యక్తుల సెలక్షన్ కమిటీ న్యూజిలాండ్‌తో పాకిస్తాన్ సిరీస్ కోసం మాత్రమే నియమించారు. పాక్ న్యూజిలాండ్‌తో రెండు టెస్టులు (ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగం), మూడు ODIలు (ప్రపంచ కప్ సూపర్ లీగ్‌లో భాగం) ఆడుతుంది. ఈ సిరీస్ డిసెంబర్ 26న ప్రారంభమై జనవరి 14న ముగుస్తుంది.

పీసీబీ మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మన్ నజం సేథీ మాట్లాడుతూ, "ఈ కొత్త పురుషుల సెలక్షన్ కమిటీని స్వాగతిస్తున్నాను. తక్కువ సమయం ఉన్నప్పటికీ, వారు ధైర్యమైన, సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటారని ఎటువంటి సందేహం లేదు." అని అన్నారు. అఫ్రిది మాట్లాడుతూ.. "PCB మేనేజ్‌మెంట్ కమిటీ ఈ బాధ్యతను అప్పగించినందుకు నేను గౌరవంగా భావిస్తున్నాను. నా సామర్థ్యాల మేరకు ఈ బాధ్యతను నిర్వర్తించడంలో ఎటువంటి అవకాశాన్ని వదులుకోను." అని అన్నారు.


Next Story