భారత మహిళా క్రికెటర్ షఫాలీ వర్మ గొప్ప హిట్టర్లలో ఒకరు. భారత జట్టుకు కెప్టెన్‌గా U19 మహిళల ప్రపంచ కప్‌ను అందించిన షఫాలీ, ఆమె బిజీ క్రికెట్ షెడ్యూల్ కారణంగా చదువుకోవడానికి ఎక్కువ సమయం దొరకడం లేదు. అయినప్పటికీ ఇటీవల ప్రకటించిన CBSE 12వ బోర్డ్ పరీక్ష ఫలితాలలో షఫాలీ మంచి మార్కులు సాధించింది. ’80+స్కోర్ సాధించాను. అయితే అది క్రికెట్‌లో కాదు. 12వ తరగతి బోర్డు పరీక్షల్లో.. మంచి మార్కులతో పాసైనందుకు చాలా సంతోషంగా ఉన్నా. ఏదీ ఏమైనప్పటికీ నాకు ఇష్టమైన సబెక్టు మాత్రం క్రికెట్.’ అంటూ షఫాలీ చెప్పుకొచ్చింది.
CBSE 10వ తరగతి ఫలితాలను ప్రకటించింది, 93.12 శాతం మంది విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. గత సంవత్సరం కంటే 1.28 శాతం ఉత్తీర్ణత తగ్గింది. విద్యార్థుల స్కోర్‌ల ఆధారంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ విభాగాల అవార్డులను రద్దు చేయాలని బోర్డు నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. బాలికలు 94.25 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలుర ఉత్తీర్ణత శాతం 92.27గా ఉంది. "విద్యార్థుల మధ్య అనారోగ్యకరమైన పోటీని నివారించడానికి CBSE ఎటువంటి మెరిట్ జాబితాను ప్రకటించదు. వివిధ సబ్జెక్టులలో అత్యధిక మార్కులు సాధించిన 0.1 శాతం మంది విద్యార్థులకు బోర్డు మెరిట్ సర్టిఫికేట్లను జారీ చేస్తుంది" అని బోర్డు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గతేడాది ఉత్తీర్ణత శాతం 94.40 గా ఉంది.