పాకిస్థాన్ క్రికెటర్లు ఇలాంటి పనులు చేస్తారా..? సోషల్ మీడియాలో వైరల్
పాకిస్థాన్ మెన్స్ క్రికెట్ టీమ్ లోని పలువురు సభ్యులు పలువురు నటీమణులకు మెసేజీలు చేస్తున్నారట.
By Medi Samrat
పాకిస్థాన్ మెన్స్ క్రికెట్ టీమ్ లోని పలువురు సభ్యులు పలువురు నటీమణులకు మెసేజీలు చేస్తున్నారట. పరిచయాలు పెంచుకోవడం కోసం టీవీ సీరియల్స్, సినిమాల్లోని హీరోయిన్లకు మెసేజీలు పంపుతున్నారు. ఈ విషయాన్ని పలువురు సెలెబ్రిటీలు బయట పెట్టడంతో పాకిస్థాన్ క్రికెట్ లో ఈ అంశంపై తీవ్ర చర్చ జరుగుతూ ఉంది.
క్రికెటర్లు మహిళా నటీమణులకు సందేశాలు పంపడంపై జరుగుతున్న చర్చల గురించి పాకిస్థాన్ ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ స్పందించారు. ఈ విషయం గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదని తెలిపారు. కొంతమంది అమ్మాయిలు అయితే అలాంటి వాదనలు చేయడం ద్వారా పాపులారిటీ పొందాలని చూస్తున్నారని షాదాబ్ ఖాన్ తెలిపారు. జియో న్యూస్లో వచ్చే “హస్నా మనా హై” షోలో మాట్లాడుతూ, షాదాబ్ మీరు ఎప్పుడైనా నటీమణులకు సందేశాలు పంపారా అనే అభిమాని ప్రశ్నకు నిజాయితీగా స్పందించాడు.
షాదాబ్ ప్రతిస్పందిస్తూ క్రికెటర్లను సమర్థించాడు. అలాంటి పరస్పర చర్యలలో తప్పు ఏమీ లేదని వాదించాడు. క్రికెటర్లు సందేశాలు పంపినా, అందులో తప్పేముంది? అని అన్నాడు. సోషల్ మీడియా వినియోగదారులకు నచ్చని సందేశాలను బ్లాక్ చేసే అవకాశాన్ని కల్పిస్తుందని తెలిపాడు. "ప్రతి ఒక్కరికి బ్లాక్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీకు నచ్చకపోతే రిప్లై ఇవ్వకండి, అయితే యాక్ట్రెస్ ల నుండి కూడా ప్రత్యుత్తరాలు వస్తుంటాయి. వారు కూడా మాట్లాడడానికి ఆసక్తిని కనబరుస్తారు" అని షాదాబ్ వివరించాడు. కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు పాకిస్థాన్ క్రికెటర్లు మెసేజీలు చేస్తున్నారనే చర్చ పాకిస్థాన్ లో ఇటీవల చాలా ఎక్కువగా నడిచింది.