భారత్-పాక్ మ్యాచ్.. టీమ్ఇండియా రహస్యాన్ని బయటపెట్టిన సెహ్వాగ్
Sehwag Explains Reason Behind India's Unbeaten.టీ 20 ప్రపంచకప్‌లో భారత జట్టు తన తొలి మ్యాచ్ ను దాయాది
By తోట వంశీ కుమార్ Published on 19 Oct 2021 6:14 PM IST
టీ 20 ప్రపంచకప్‌లో భారత జట్టు తన తొలి మ్యాచ్ ను దాయాది పాకిస్థాన్‌తో ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ హైటెన్షన్ మ్యాచ్‌కు మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. ఓవరాల్‌గా చూసుకుంటే పాక్ జట్టుదే ఆధిపత్యం కనిపిస్తున్నప్పటికి.. వరల్డ్ కప్ లాంటి మెగాటోర్నీల్లో మాత్రం టీమ్ఇండియా రికార్డు చాలా అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు మెగా టోర్నీల్లో ఒక్కసారి కూడా భారత జట్టును పాక్ ఓడించలేదు. ఇప్పటి వరకు ఇరుజట్లు వన్డే ప్రపంచకప్‌లో 7 సార్లు తలపడగా.. ప్రతిసారి భారత జట్టునే విజయం వరించింది. ఇక టీ 20 ప్రపంచకప్‌లో ఇరు జట్లు 5 సార్లు తలపడగా.. నాలుగు సార్లు టీమ్ఇండియా విజయం సాధించగా.. ఓ మ్యాచ్ డ్రా ముగిసింది.
ఇక ఎప్పటిలాగానే.. పాక్ ఆటగాళ్లతో పాటు మాజీలు భారత జట్టుపై విమర్శలు చేయడం ఆరంభించారు. వీటిపై భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ స్పందించారు. మెగా టోర్నీల్లో మ్యాచ్‌లకు ముందు పాకిస్థాన్ ఆటగాళ్లు, మాజీ క్రికెటర్లలా తాము పెద్దపెద్ద స్టేట్‌మెంట్స్ ఇవ్వమని.. ఇదే టీమ్ఇండియా విజయరహస్యమని చెప్పాడు. మాటలకు బదులు మ్యాచ్‌కు అన్ని రకాలుగా సన్నమవుతామని తెలిపాడు. ఒత్తిడిని భారత జట్టు బాగా హ్యాండిల్ చేస్తుందన్నాడు. 2003, 2011ప్రపంచకప్‌లలో భారత జట్టుపై పెద్దగా ఒత్తిడి లేదన్నాడు. 'ఎందుకంటే ఆయా ప్రపంచకప్‌లలో పాక్ కంటే ఎప్పుడూ మేము మెరుగ్గానే ఉన్నాం. అలాంటి వైఖరితో ఆడితే మనం ఎప్పుడూ అలాంటి పెద్ద పెద్ద స్టేట్‌మెంట్లు ఇవ్వం' అని సెహ్వాగ్ చెప్పాడు.
మెగా టోర్నీల్లో భారత్‌ను పాక్ ఓడించాలంటే టీ 20 పార్మాటే సువర్ణ అవకాశం అన్నాడు. కేవలం ఒక్క ఆటగాడే మ్యాచ్ ఫలితాన్ని మార్చివేయోచ్చునని చెప్పాడు. అయితే.. పాక్ ఇప్పటి వరకు ఆ పని చేయలేదన్నాడు. ఇప్పుడున్న పరిస్థితులు, టీ 20 ఫార్మాట్‌ను తీసుకుంటే పాక్‌కు అవకాశాలున్నాయన్నారు. ఏం జరుగుతుందో అక్టోబర్ 24న చూద్దామని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.