కాంస్యం నెగ్గిన సాత్విక్‌-చిరాగ్‌ శెట్టి

Satwik-Chirag sign off with a maiden bronze medal at World Championships.ప్ర‌పంచ బ్యాడ్మింట‌న్ ఛాంపియ‌న్‌షిప్‌లో భార‌త

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Aug 2022 12:48 PM IST
కాంస్యం నెగ్గిన సాత్విక్‌-చిరాగ్‌ శెట్టి

ప్ర‌పంచ బ్యాడ్మింట‌న్ ఛాంపియ‌న్‌షిప్‌లో భార‌త జోడి అద‌రగొట్టింది. సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జంట క్యాంసంతో మెరిసింది. దీంతో ఈ టోర్నీలో ప‌త‌కం సాధించిన తొలి భార‌త పురుషుల జోడీగా స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింది. శ‌నివారం జ‌రిగిన సెమీస్ మ్యాచ్‌లో మ‌లేషియా జంట ఆర‌న్ చియా-సోమ్ వూ యిక్‌ల చేతిలో స్వాతిక్‌-చిరాగ్ జోడి ఓట‌మిపాలైంది. 77 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో తొలి గేమ్‌లో ఇండియ‌న్ జంట థ్రిల్లింగ్ రీతిలో నెగ్గినా ఆ త‌ర్వాత రెండు గేమ్‌లను కోల్పోయింది.

22-20, 18-21, 16-21 తేడాతో ఓట‌మి పాలై క్యాంసంతో టోర్నీని ముగించింది. కాగా.. మ‌లేషియా జోడి చేతిలో స్వాతిక్‌-చిరాగ్ ఓడిపోవ‌డం వ‌రుస‌గా ఇది ఆరోసారి కావ‌డం గ‌మ‌నార్హం. ఓట‌మిపాలైన‌ప్ప‌టికీ ప్ర‌పంచ ఛాంపియ‌న్ షిప్‌లో ఈ జోడీ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసింది. 11 ఏళ్ల త‌రువాత ఈ టోర్నీలో డ‌బుల్స్ విభాగంలో భార‌త్‌కు ప‌త‌కం వ‌చ్చింది. ప్ర‌పంచ ఛాంపియ‌న్ షిప్ డ‌బుల్స్‌లో భార‌త్‌కు ఇది రెండో ప‌త‌కం కాగా.. పురుషుల విభాగంలో మొద‌టిది. 2011లో మ‌హిళల డ‌బుల్స్ విభాగంలో గుత్తా జ్వాల‌-అశ్విని పొన్న‌ప్ప జోడీ కాంస్యం సాధించింది.

Next Story