స్టేడియంలో 'సారా' ఉంది.. శుభ్‌మాన్ గిల్ ఎవ‌రినీ నిరాశ‌ప‌ర‌చ‌డు..!

సచిన్ టెండూల్కర్ కూతురు సారా బ్రిస్బేన్ చేరుకుని టీమిండియాకు మద్దతుగా నిలిచింది.

By Medi Samrat  Published on  14 Dec 2024 1:36 PM GMT
స్టేడియంలో సారా ఉంది.. శుభ్‌మాన్ గిల్ ఎవ‌రినీ నిరాశ‌ప‌ర‌చ‌డు..!

సచిన్ టెండూల్కర్ కూతురు సారా బ్రిస్బేన్ చేరుకుని టీమిండియాకు మద్దతుగా నిలిచింది. సారా టెండూల్కర్ జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్‌లతో కనిపించింది. బ్రిస్బేన్ స్టేడియం వెలుపల ఉన్న చిత్రాన్ని సారా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటో వైరల్ అడంతో.. అభిమానులు గిల్‌కు మద్దతు ఇవ్వడానికి సారా ఆస్ట్రేలియాకు వెళ్లిందని కామెంట్లు చేశారు.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మూడో టెస్టు మ్యాచ్ బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా జరుగుతోంది. తొలి రోజు టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. వర్షం కారణంగా తొలిరోజు 13.2 ఓవర్లు మాత్రమే ఆట జ‌రిగింది. ఈ సమయంలో ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా శనివారం జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌ను చ‌సేందుకు గ్రేట్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా కూడా మైదానానికి వెళ్లింది.

సారా ఫోటోలు సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. అభిమానులు ఆమెకు క్రీడపై ఉన్న ప్రేమను హైలైట్ చేశారు. ఫోటోను పంచుకుంటూ.. చాలా మంది అభిమానులతోపాటు స్టేడియంలో సారా కూడా ఉందని.. కాబట్టి శుభమాన్ గిల్ తమను నిరాశపరచడ‌ని కామెంట్స్ చేస్తున్నారు. మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు.. సారా గబ్బాలోకి ప్రవేశించే ముందు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక చిన్న వీడియోను కూడా పోస్ట్ చేసింది.

ఇదిలావుంటే.. ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 28 పరుగులతో ముగిసింది, ఉస్మాన్ ఖవాజా 19 పరుగులతో నాటౌట్‌గా.. నాథన్ మెక్‌స్వీనీ నాలుగు పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా తొలిరోజు మ్యాచ్ రద్దయి ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేసింది. మిగిలిన నాలుగు రోజులు ఆట 30 నిమిషాల ముందుగానే ప్రారంభమవుతుంది. ప్రతి రోజు కనీసం 98 ఓవర్ల ఆట జ‌రుగుతుంది. ఇదిలావేంటే.. ప్లేయింగ్ ఎలెవన్‌లో భారత జట్టు రెండు మార్పులు చేసింది. అశ్విన్, హర్షిత్ రానాల స్థానంలో జడేజా, ఆకాశ్‌దీప్‌లను తీసుకున్నారు.

Next Story