తొలి ఓవర్లోనే మూడు వికెట్లు తీసి టీమిండియాను భారీ దెబ్బ కొట్టిన ఇంగ్లండ్ పేసర్
శుక్రవారం పూణె వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌కు ఇంగ్లండ్ క్రికెట్ జట్టు భారీ మార్పు చేసింది.
By Medi Samrat Published on 31 Jan 2025 8:22 PM ISTశుక్రవారం పూణె వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌కు ఇంగ్లండ్ క్రికెట్ జట్టు భారీ మార్పు చేసింది. ఈ మ్యాచ్‌లో మార్క్ వుడ్‌ను జట్టు నుంచి తప్పించి అతని స్థానంలో షకిబ్ మహమూద్‌కు అవకాశం కల్పించారు. భారత్‌తో షకీబ్‌కి ఇది తొలి T20 మ్యాచ్. ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ మొదటి ఓవర్లోనే భారత్‌ను చావు దెబ్బ తీశాడు. షకీబ్ తన మొదటి ఓవర్లోనే మూడు వికెట్లు తీశాడు. ఇది మాత్రమే కాదు. ఈ ఓవర్లో షకిబ్ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. అతను ఈ ఓవర్ త్రీ వికెట్ మెయిడిన్ బౌలింగ్ చేశాడు. దీంతో అంతర్జాతీయ టీ20లో ట్రిపుల్ వికెట్‌తో మెయిడిన్ ఓవర్ వేసిన తొలి ఇంగ్లండ్ బౌలర్‌గా షకీబ్ నిలిచాడు. అలాగే భారత్‌పై ఈ ఘనత సాధించిన తొలి ఇగ్లాండ్ బౌలర్‌గా కూడా నిలిచాడు.
సంజూ శాంసన్‌ను షకీబ్ ఓవర్ తొలి బంతికే పెవిలియన్‌కు పంపాడు. సంజూ మరోసారి షార్ట్ బాల్‌కు బలయ్యాడు. మరుసటి బంతికే షకిబ్ తిలక్ వర్మకు పెవిలియన్ దారి చూపించాడు. ఆఫ్ స్టంప్ వెలుపల షకీబ్ వేసిన బంతి తిలక్ బ్యాట్ అంచుని థర్డ్ మ్యాన్ వైపు తీసుకువెళ్లగా.. అక్కడ జోఫ్రా ఆర్చర్ క్యాచ్ పట్టడంతో డకౌట్‌గా వెనుదిరిగాడు.
ఆ ఓవర్ చివరి బంతికే షకీబ్ భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను అవుట్ చేశాడు. ఈసారి అటాకింగ్ ఫీల్డ్ కారణంగా సూర్యకుమార్ అవుట్ అయ్యాడు. సూర్యకుమార్ తన కాలిపై పడిన బంతిని ఫ్లిక్ చేసి కర్స్ చేతికి చిక్కాడు. ఈ క్రమంలో సాకిబ్ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. తొలి, చివరి బంతితో పాటు రెండో బంతికి కూడా వికెట్ తీశాడు. ఈ సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్‌లు టీమ్ఇండియాను తీవ్రంగా నిరాశపరిచారు. నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయాడు. సూర్యకుమార్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ దిగ్గజ టీ20 బ్యాట్స్‌మన్ ఈ సిరీస్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. ఒక్క మ్యాచ్‌లో కూడా సూర్యకుమార్ 20 పరుగుల మార్కును కూడా దాటలేకపోయాడు.