ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు సంజు శాంసన్, చాహల్‌ను పట్టించుకోని సెలక్షన్ కమిటీ
ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించారు. సీనియర్ ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో
By Medi Samrat Published on 21 Nov 2023 4:16 PM ISTఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించారు. సీనియర్ ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీ సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా నియమించింది. నవంబర్ 23న విశాఖలో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ప్రపంచకప్ జట్టుకు ఎంపికైన నలుగురు ఆటగాళ్లు మాత్రమే ఈ సిరీస్‌కు ఎంపికయ్యారు. వీరిలో శ్రేయాస్ అయ్యర్ చివరి రెండు మ్యాచ్‌లకు మాత్రమే జట్టులో చేరనున్నాడు. సూర్యకుమార్‌తో పాటు ఇషాన్ కిషన్, ప్రసిద్ధ్ కృష్ణలకు మాత్రమే చోటు దక్కింది. అనుభవజ్ఞుడైన లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్‌లను సెలక్షన్ కమిటీ పట్టించుకోలేదు.
భారత్ తరఫున 80 టీ20 మ్యాచ్‌లు ఆడిన చాహల్ జట్టులోకి ఎంపిక కాకపోవడంతో సోషల్ మీడియాలో స్పందించాడు. ఎంపిక కానప్పటికీ చహల్ నవ్వుతున్న ఎమోజీని షేర్ చేశాడు. ఇది చూసిన అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. కామెంట్‌లతో చాహల్‌కు మద్దతు తెలిపాడు. చాహల్ 80 టీ20 మ్యాచుల్లో 96 వికెట్లు తీశాడు. చివరి 10 టీ20 మ్యాచ్‌ల్లో అతడు తొమ్మిది వికెట్లు తీశాడు.
మరోవైపు 24 టీ20లు ఆడిన సంజూ శాంసన్ కూడా ఈ సిరీస్‌కు ఎంపిక కాలేదు. అతడు దేశం తరఫున టీ20లలో 19.68 సగటుతో 133.57 స్ట్రైక్ రేట్‌తో 374 పరుగులు మాత్రమే చేశాడు. శాంసన్ అత్యధిక స్కోరు 77 పరుగులు. చివరి ఐదు టీ20ల్లో సంజు మూడుసార్లు బ్యాటింగ్ చేశాడు. వెస్టిండీస్‌పై 13 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత ఐర్లాండ్‌పై ఒక్క పరుగు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆ తర్వాత అదే జట్టుపై 40 పరుగులు చేశాడు.
శాంసన్ ఎంపిక కాకపోవడంతో సోషల్ మీడియాలో అభిమానుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. సెలక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజుకు కంటిన్యూగా అవకాశాలు రావడం లేదని ఫ్యాన్స్ అంటున్నారు. సంజు ఐపీఎల్‌లో 152 మ్యాచ్‌లు ఆడి 148 ఇన్నింగ్స్‌ల్లో 3,888 పరుగులు చేశాడు. అతను 29.23 సగటుతో మరియు 137.19 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో శాంసన్‌కు మూడు సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కోసం భారత జట్టు..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.