పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు అనూహ్య విజయం సాధించింది. ఆఖరి ఓవర్‌లో త్యాగి అద్భుత బౌలింగ్‌తో కేవలం ఒక పరుగు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టి రాజస్థాన్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ విజయంతో మంచి జోష్ మీదున్న రాజస్థాన్ కు ఐపీఎల్ కౌన్సిల్ షాకిచ్చింది. స్లో ఓవర్ రేటు కారణంగా ఆ జట్టు కెప్టెన్ సంజుశాంసన్‌కు రూ.12లక్షల జరిమానా విధించింది. నిర్దిష్ట సమయంలో బౌలింగ్ పూర్తి చేయని కారణంగా జరిమానా పడింది.
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో సెప్టెంబర్ 21న జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్‌కు జరిమానా విధించాం. ఈ సీజన్‌లో ఇదే తొలి తప్పిదం కావడంతో.. రూ.12లక్షలతో సరిపెడుతున్నట్లు ఐపీఎల్ కౌన్సిల్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఐపీఎల్ నిబంధనల ప్రకారం
- తొలిసారి ఓవర్ రేటు నిబంధనలు ఉల్లంఘిస్తే సదరు జట్టు కెప్టెన్‌కు రూ. 12 లక్షలు, అదే తప్పు మళ్లీ చేస్తే.. రూ. 24 లక్షలు, తుదిజట్టులోని ప్రతీ ఆటగాడి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత పడుతుంది. ఇక మూడోసారి కూడా అదే జరిగితే, కెప్టెన్‌కు రూ. 30 లక్షల జరిమానాతో పాటు, ఒక మ్యాచ్‌లో నిషేధం, తుదిజట్టులోని ఆటగాళ్లకు రూ. 12 లక్షల జరిమానా, లేదంటే మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధిస్తారు.