హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు టికెట్లు కావాలా.? ఈ వివరాలు మీకే..!

భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయం ఈరోజు ప్రారంభం అవనుంది

By M.S.R  Published on  5 Oct 2024 12:00 PM IST
హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు టికెట్లు కావాలా.? ఈ వివరాలు మీకే..!

భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయం ఈరోజు ప్రారంభం అవనుంది. హైదరాబాద్‌లోని క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ చూడడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అక్టోబర్ 12న ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. Paytm ప్లాట్‌ఫారమ్ ద్వారా మధ్యాహ్నం 12:30 గంటలకు టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావు ప్రకటించారు.

వివిధ రకాల సీటింగ్‌లకు అనుగుణంగా ధర రూ.750 నుండి రూ.15,000 వరకు ఉంటుంది. ఆన్‌లైన్ లో టికెట్లను బుక్ చేసుకునే వాళ్లు అక్టోబర్ 8- అక్టోబర్ 12 మధ్య జింఖానా స్టేడియంలో టిక్కెట్‌లను రీడీమ్ చేసుకోవాలని సూచించారు. స్థానిక అధికారులు నకిలీ టిక్కెట్‌లకు వ్యతిరేకంగా జీరో-టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.

ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ ఈవెంట్‌ను ఎంజాయ్ చేయడానికి హైదరాబాద్‌లోని క్రికెట్ ఔత్సాహికులు టికెట్ల కోసం ఎగబడే అవకాశం ఉంది. 2024 అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను భారత్ 2-0తో గెలుచుకుంది. రెండో టెస్టులో వర్షం కారణంగా రెండున్నర రోజులు మ్యాచ్ రద్దైనా కూడా భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Next Story