సైనా నెహ్వాల్ కు కరోనా.. థాయిలాండ్‌ ఓపెన్‌ నుంచి అవుట్‌

Saina Nehwal test corona positive in Thailand.ఒలింపిక్ కాంస్య పతక విజేత, భార‌త స్టార్‌ ష‌ట్ల‌ర్ సైనా నెహ్వాల్‌కు క‌రోనా, థాయిలాండ్‌ ఓపెన్‌ నుంచి అవుట్‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Jan 2021 6:17 AM GMT
Saina Nehwal test corona positive

ఒలింపిక్ కాంస్య పతక విజేత, భార‌త స్టార్‌ ష‌ట్ల‌ర్ సైనా నెహ్వాల్‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. నేటి నుండి థాయిలాండ్ ఓపెన్ సూపర్‌-1000 ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో నిర్వాహ‌కులు క్రీడాకారులంద‌రికి కరోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఈ ప‌రీక్ష‌లో సైనా నెహ్వాల్‌కు క‌రోనా సోకిన‌ట్టు తేలింది. కరోనా వైరస్ కారణంగా దాదాపు 10 నెలల‌పాటు ఇంటికే పరిమిత‌మైన సైనా థాయిలాండ్ ఓపెన్‌లో పాల్గొందామ‌ని సిద్ధ‌మైన స‌మయంలో కరోనా పాజిటివ్‌గా అని తేల‌డం పెద్ద షాకింగ్‌గా మారింది.

తొలి రౌండ్‌లో మలేసియాకు చెందిన షట్లర్‌ కిసోనా సెల్వడురేతో సైనా తలపడాల్సి ఉంది. అయితే కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆమెను టోర్నమెంట్ నుంచి తప్పుకోవాలని బీడబ్ల్యూఎఫ్‌ కోరింది. సైనాతోపాటు మరో భారత షట్లర్‌ ప్రణయ్‌ కూడా కోవిడ్‌ బారిన పడ్డాడు. వెంట‌నే వీరిద్ద‌రిని ఆసుప‌త్రికి త‌రలించారు. అయితే కొద్ది రోజుల క్రిత‌మే సైనా క‌రోనా నుండి కోలుకోగా, ఇప్పుడు ఆమెకు మ‌ళ్ళీ పాజిటివ్ రావ‌డం ఆందోళ‌న రేకెత్తిస్తుంది.‌

Next Story
Share it