కొడుకు ఆడుతుంటే ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌లేదు అన్న స‌చిన్‌

Sachin Tendulkar reveals why he hasn’t seen his son Arjun play as yet.క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్ త‌న కుమారుడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Feb 2022 10:27 AM GMT
కొడుకు ఆడుతుంటే ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌లేదు అన్న స‌చిన్‌

క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్ త‌న కుమారుడు ఆడే మ్యాచ్‌ల‌ను చూడ‌న‌ని చెప్పాడు. 22 ఏళ్ల అర్జున్ టెండూల్క‌ర్ ముంబై రంజీ జ‌ట్టులో భాగంగా ఉన్నాడు. ఇటీవ‌ల ముగిసిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) లో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు అర్జున్‌ను రూ.30 ల‌క్ష‌ల‌కు కొనుగోలు చేసింది. త‌న కొడుకు ఆడే మ్యాచ్‌ల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌లేదని అని స‌చిన్ చెప్పాడు. అందుకు గ‌ల కార‌ణాల‌ను వివ‌రించారు.

పిల్ల‌లు ఆడుతున్న‌ప్పుడు తల్లీదండ్రులు వారి ఆట‌ను చూస్తుంటే వారు ఒత్తిడికి లోన‌వుతారు. అందుకే అర్జున్ ఆడే మ్యాచ్‌ల‌కు నేను వెళ్ల‌ను. అత‌డు పూర్తి స్వేచ్చ‌తో ఆడాలి. క్రికెట్‌ను ప్రేమించాల‌ని కోరుకుంటాను. తను కావాలనుకుంటుంది సాధించాలని ఆడుకోవడానికి వదిలేస్తాను. ఎందుకంటే నాకు కూడా ఎవరైనా(కుటుంబ స‌భ్యులు) చూస్తే నచ్చేది కాదు. నేను వెళ్లి అతని మ్యాచ్ లు చూస్తే.. కనిపించకుండా ఎక్కడైనా ఉండిపోతా. అతనికి తెలియకుండా ఉండేందుకే ప్రయత్నిస్తా. అది అతని కోచ్ తో పాటు ఎవ్వరికీ తెలీదు అని స‌చిన్ చెప్పుకొచ్చాడు. ఇక అర్జున్ కు పుట్‌బాల్‌, చెస్ కూడా ఆడ‌టం వ‌చ్చు. అత‌డి జీవితంలోకి క్రికెట్ ఆల‌స్యంగా వ‌చ్చిన‌ట్లు స‌చిన్ చెప్పాడు.

Next Story
Share it