మోదీకి టీమిండియా జెర్సీ అందించిన సచిన్.. వీడియో వైరల్

ప్రధాని నరేంద్ర మోదీకి క్రికెట్ దిగ్సజం సచిన్ టెండూల్కర్‌ ప్రత్యేక బహుమతిని అందించారు.

By Srikanth Gundamalla  Published on  24 Sept 2023 11:46 AM IST
Sachin , team india, special jersey,  PM Modi,

మోదీకి టీమిండియా జెర్సీ అందించిన సచిన్.. వీడియో వైరల్

ప్రధాని నరేంద్ర మోదీకి క్రికెట్ గాడ్‌ సచిన్ టెండూల్కర్‌ ప్రత్యేక బహుమతిని అందించారు. 'నమో' నెంబర్‌-1 పేరుతో ఉన్న ప్రత్యేక టీమిండియా జెర్సీని అందజేశారు టెండూల్కర్.

భారత్‌లో మరో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో అందుబాటులోకి రానుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మోదీ పార్లమెంట్ నియోజకవర్గం వారణాసిలో కొత్త క్రికెట్‌ స్టేడియం నిర్మాణ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారమే శంకుస్థాపన చేశారు. ఈ స్టేడియం నిర్మాణం కోసం 31 ఎకరాలను ఉత్తర్‌ ప్రదేశ్ ప్రభుత్వం రూ.121 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ స్టేడియం నిర్మాణానికి బీసీసీఐ రూ.330 కోట్లు వెచ్చించనుంది. రింగోఓ రోడ్డు సమీపంలోని రాజాతలాబ్‌ ప్రాంతంలో స్టేడియాన్ని ఏర్పాటు చేయనున్నారు అధికారులు. అయితే.. ఈ స్టేడియం 2025 డిసెంబర్ నాటికల్లా అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఏర్పాటు అవుతోన్న అంతర్జాతీయ మూడో క్రికెట్‌ స్టేడియం ఇది. ఇప్పటికే కాన్పూర్, లక్నోల్లో ఒక్కో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి.

ప్రముఖ పుణ్యక్షేత్రమైన వారణాసిలో ఈ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మహాశివుడి థీమ్‍తో ఉంటుందని తెలుస్తోంది. ఈ స్టేడియం డూమ్.. ఢమరుకం షేప్‍లో ఉండనుందని సమాచారం. అలాగే.. ఫ్లడ్ లైట్స్ శివుడి త్రిశూలం ఆకారంలో, ఎంట్రెన్స్ డిజైన్ బిల్వ పత్రాల్లా ఉంటాయని తెలుస్తోంది. స్టేడియం రూఫ్ నెలవంక ఆకారాన్ని పోలి ఉండనుంది. ప్రేక్షకులు సీటింగ్‌ స్టాండ్స్‌ అయితే గంగాఘాట్ స్ఫూర్తితో నిర్మితమవుతాయని ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి సునీల్‌ గావస్కర్, కపిల్‌ దేవ్, సచిన్‌ టెండూల్కర్, దిలీప్‌ వెంగ్‌సర్కార్, రవిశాస్త్రి, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, కార్యదర్శి జై షా సహా పలువురు హాజరు అయ్యారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీకి సచిన్‌ టెండూల్కర్‌ భారత జట్టు స్పెషల్ జెర్సీని అందించారు. సచిన్ బహుకరించిన జెర్సీపై నమో అని రాసి ఉంది. బీసీసీఐ రోజర్ బిన్నీ, జైషా భారత జట్టు క్రికెట్‌ సభ్యలు సంతకాలు చేసిన బ్యాట్‌ను ప్రధానికి ప్రదానం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Next Story